calender_icon.png 22 January, 2026 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడారంలో క్యాబినెట్ మీటింగ్ ఆదివాసుల కోసమా.. గిరిజనేతరుల కోసమా?

22-01-2026 02:06:07 AM

జి.ఎస్.పి రాష్ట్ర కార్యదర్శి పూనేం.సాయిదొర

వెంకటాపురం(నూగూరు), జనవరి 21(విజయక్రాంతి): మేడారంలో రాష్ట్ర క్యాబినెట్ సమావేశం గిరిజనుల కోసమా లేక గిరిజనేతల కోసమా అని జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి దొర ప్రశ్నించారు. బుధవారం వెంకటాపురం మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జి ఎస్ పి మం డల కార్యకర్తల సమావేశంలో జిఎస్పి ము లుగు జిల్లా అధ్యక్షులు ప్రతాపు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి పూనేం సాయి దొర. మాట్లాడుతూ మే డారం సమ్మక్క, సారక్క ఆదివాసి ఇలవేల్పుల జాతరను గిరిజనేతరుల చేతిలోకి ప్రభుత్వం పంపించిందన్నారు.

ఈ రాష్ట్ర ప్ర భుత్వంపై ఆయన మండిపడ్డారు. 5 షెడ్యూ ల్ ఏరియాలో సమ్మక్క, సారక్క బ్రిటిష్ కాలంలోనే బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి పోరా టం చేసిన ఘనత శ్రీ సమ్మక్క, సారక్కకి దక్కిందని ఆయన అన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమ్మ క్క, సారక్క సాక్షిగా క్యాబినెట్ మీటింగ్ నే ఏర్పాటు చేశానని ఆయన గొప్పగా చెప్పుకుంటున్నాడని విమర్శించారు. 5వ షెడ్యూ ల్ ఏరియాలకు వచ్చి ఉన్నావు, ఆదివాసీలకు వ్యతిరేకంగా ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏజెన్సీ చట్టాలను గౌరవించలేకపోవడం సిగ్గుచేటని ఆయన మండిప డ్డారు.

క్యాబినెట్ మంత్రివర్గంలో ఆదివాసి ఎమ్మెల్యేలకు ఆదివాసి చట్టాల గురించి తెలియదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. మేడారం జాతరకి రూ.250 కోట్లు ఇచ్చారని తెలంగాణ ముఖ్యమంత్రి గారే చెప్పారు కదా అక్కడ మేడారం జాతరలు నాణ్యత మైన రోడ్లు లేవు, లైట్లు లేవు అని ఎద్దేవా చేశారు. ఇదేనా నీ బాగోతం అని ఆయన మండిపడ్డారు. ఏజెన్సీచట్టాల గురించి రేవంత్ రెడ్డి ఏం తెలుసని ఆయన ప్రశ్నించారు.

అసెంబ్లీ సమావేశంలో ఆదివాసి ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారా? మేడారం జాతరలో రూ. 250 కోట్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసి సమస్యలపై క్యాబినెట్లో ఎందుకు చర్చించలేదు అని సూటిగా ప్రశ్నించారు. దీనికి ఆదివాసి ఎమ్మెల్యేలు జవాబుదారీగా ఉండవలసి వస్తుందని ఆయన అన్నారు. షెడ్యూల్ ఏరియాలో 3 జీవోను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తుంటే, ఈ తెలంగాణ ముఖ్యమంత్రి నిద్రపోతున్నాడా? అని ప్రశ్నించారు. 

మేడారం జాతరకొచ్చి సమ్మక్క, సారక్కను గిరిజనేతరుల చేతుల్లో పెట్టాడని అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం రావటానికి కారణం ఆదివాసీలు కూడా నిరంతర ఉద్యమాలు చేసి సమ్మక్క, సారక్క లాగానే ప్రాణాలు వదిలారని ఆయన గుర్తు చేశారు.