22-01-2026 02:03:30 AM
తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి
హనుమకొండ టౌన్, జనవరి 21 (విజయక్రాంతి): ఎఫ్‌ఎం ఎం సాంఘిక సంస్థ ఆధ్వర్యంలో వనమ్ మహిళా సహకార సంఘం 18వ సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారాల్లోకి వచ్చినప్పటినుండి మహిళల అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని ఆర్థిక, సామాజిక భద్రత కల్పించడమే కాకుండా మహిళల ఆత్మగౌరాన్ని పెంపొందించే దిశగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుందని ప్రతిష్టాత్మకమైన పథకాలలో ఇందిరమ్మ ఇల్లు మహిళా ప్రధాని మహిళా శక్తికి ప్రతికైనా దిగవంత ఇందిరాగాంధీ పేరు మీద ఇండ్ల నిర్మాణం చేపట్టడం గర్వకారణం అని నిరుపేద మహిళలకు పక్కా ఇల్లు అందించడమే లక్ష్యంగా వారి జీవన ప్రమాణాలను మెరుగుపర చడమే ప్రధాన లక్ష్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఉద్యోగాలు, వైద్యం, విద్య, గృహ జ్యోతి ద్వారా విద్యుత్ ఖర్చుల భారాన్ని మహిళలకు అందించడం ద్వారా పెద్ద ఊరట అని రానున్న రోజుల్లో మహిళల కోసం మరింత సంక్షేమ పథకాలు అమలు చేసి వారి జీవితాల్లో వెలుగు నింపుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వనం మహిళా సహకార సంఘ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.