21-09-2025 12:02:34 AM
ప్రజాపాలన దినోత్సవంలో ప్రొటోకాల్ పాటించని సందీప్‌కుమార్ ఝా
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను బదిలీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఈ నెల 17న ప్రజాపాలన దినోత్సవ రోజు జెండా ఆవిష్కరణలో ప్రోటోకాల్ విస్మరించడం పట్ల ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. అయితే తాను అనారోగ్యం కారణంగా హాజరు కాలేకపోయానని వివరణ ఇచ్చారు. కలెక్టర్ హాజరు కాకపోవడాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రొటోకాల్‌తో పాటు కలెక్టర్ తరచూ వివాదాల విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీనిపై రేవంత్‌రెడ్డి సీరియస్‌గా ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఇది ఇలా ఉంటె కలెక్టర్ దేవాదాయ శాఖకు మార్చాలని కోరగా ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ ఆ శాఖకు వద్దని అడ్డుకున్నారని సమాచారం.