21-09-2025 12:04:45 AM
మణుగూరు,(విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దంపట్టే పండుగ బతుకమ్మ పండుగ అని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శ్రీ విజ్ఞాన్ స్కూల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను ఒకచోట పేర్చి విద్యార్థులు, మహిళ ఉపాధ్యాయుల బతుకమ్మ ఆటలతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... విద్యార్థులకు చదువుతో పాటు సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆడపడు చులకు, నియోజకవర్గ ప్రజలకు బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు.