calender_icon.png 1 July, 2025 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖరీఫ్ సీజన్ ధాన్యం ఉన్నదా..?

01-07-2025 02:15:58 AM

-మిల్లుల్లో ఫిజికల్ వెరిఫికేషన్

-జాయింట్ తనిఖీల్లో భయటపడనున్న షార్టేజీ

-ఆరు రోజుల్లో లెక్కింపు సాధ్యపడేనా..?

మంచిర్యాల, జూన్ 30 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో 2024 వానా కా లం సీజన్‌కు సంబంధించి మిల్లుల్లో దిగిన సీఎంఆర్ ధాన్యం ఉందో..! లేదో..! తెలుసుకునేందుకు సివిల్ సప్లయ్ కమిషనర్ కార్యా లయం నుంచి ఆదేశాలిచ్చారు. వారం రోజుల్లోపు వానా కాలం సీజన్‌లో జిల్లాలోని 30 మిల్లులకు కేటాయించిన ధాన్యాన్ని తనిఖీ చేయనున్నారు. ఈ తనిఖీలతోనే మిల్లుల్లో ధాన్యం ఉందా! లేదా అనేది తేలడంతో పాటు, మిల్లుల్లో ఉన్న ధాన్యం ఆధారంగానే ఉన్నతాధికారులు వానా కాలం సీజన్ సీఎంఆర్‌కు ఎక్స్ టెన్షన్ ఇచ్చే అవకాశం ఉంటుం ది. తనిఖీల అనంతరం భయటపడనుంది.

మిల్లుల్లో ఫిజికల్ వెరిఫికేషన్...

జిల్లాలోని 30 మిల్లుల్లో ఎఫ్సీఐ అధికారులతో పాటు పౌరసరఫరాల శాఖ, పౌర సరఫరాల సంస్థ సభ్యులు జాయింట్ ఫిజికల్ వెరిఫికేషన్ (జేపీవీ) చేయనున్నారు.  సివిల్ సప్లయ్ కమిషనర్ ముజామ్మిల్ ఖాన్ నుంచి అందిన ఆదేశాల మేరకు ఈ నెల ఆరవ తేదీలోపు తనిఖీలు చేసి నివేధికను ఉన్నతాధికారులకు అందజేయాల్సి ఉంటుం ది. నివేధిక ఆధారంగానే సీఎంఆర్ పెట్టేందుకు మిల్లర్లకు గడువు ఇవ్వనున్నారు.

తనిఖీల్లో భయటపడనున్న షార్టేజీ..

2024- వానాకాలానికి సీఎంఆర్ కింద జిల్లాలో 30 బాయిల్డ్, రా రైస్ మిల్లులకు 78,879 మెట్రిక్ టన్నులు కేటాయిం చారు. మిల్లింగ్ చేసి 53,120 మెట్రిక్ టన్ను ల (1832 ఏసీకేల) బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 32,891 మెట్రిక్ టన్నులు (1134 ఏసీకేలు) అందజేశారంటే 62 శాతం సీఎంఆర్ పెట్టినట్టు. ఇంకా 20,229 మెట్రిక్ టన్నుల బియ్యం అందజేయాల్సి ఉంది. జేపీవీలో మిల్లుల్లో ధాన్యం ఉందో..! లేదో...! ఎంత ధాన్యం షార్టేజీ ఉందో భయటపడనుంది. 30 మిల్లుల్లో సుమారు 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉండాలి కానీ ఇప్పటికే చాలా మిల్లు ల్లో ఖరీఫ్ ధాన్యం మాయమైనట్టు సమాచా రం. జేపీవీలో అది నిర్ధారణ కానుందని కొం దరు మిల్లర్లే బాహాటంగా చెప్పుకొస్తున్నారు.

౬ రోజుల్లో లెక్కింపు సాధ్యపడేనా..?

సివిల్ సప్లయ్ కమిషనరేట్ కార్యాలయం నుంచి జూన్ 28వ తేదీన జిల్లాలోని మిల్లు ల్లో జాయింట్ ఫిజికల్ వెరిఫికేషన్ చేయాల ని ఆదేశాలు వచ్చినా ఇప్పటి వరకు ఇంకా సంబంధిత అధికారులు మొదలే పెట్టలేదు. ఆరు రోజుల్లో 30 మిల్లుల్లో ఉండాల్సిన 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం బస్తాలను కౌంటింగ్ సాధ్యపడుతుందా..? మిల్లుల్లో ధాన్యం బస్తాలు కౌంటింగ్ కు అనుకులంగా నిలువ చేసి ఉండవు, ఇలాంటి సమయంలో ధాన్యం అమ్ముకున్న మిల్లర్లు ఈజీగా బయటపడే అవకాశం లేకపోలేదు. మిల్లుల్లో ధా న్యం బస్తాలను కౌంటింగ్ కు అనుకూలంగా ఉంచాలని సంబంధిత శాఖ అధికారులు ఎన్ని సార్లు చెప్పినా ఏ ఒక్క మిల్లులో అలా ఉండవనేది జగమెరిగిన సత్యం. ఇలాంటి  తరుణంలో ఆరు రోజుల్లో కౌంటింగ్ తూతూ మంత్రంగానే జరుగనుందా..! వేచి చూడాలి మరి...