20-05-2025 01:31:53 AM
బుద్ధారం గండిలో హల్చల్
దోచుకోవడం ఈజీ ప్రాసెస్
కష్టపడడం అంటే కష్టం
కొత్త అవతారమెత్తిన దోపిడీ గ్యాంగ్
గోపాలపేట మే 19: ఎన్నాళ్లు కష్టపడ్డా సు ఖపడ్డ పాపాన పోలేదంటూ ఒక్కసారి దో పిడీ చేస్తే హాయిగా కూర్చొని సుఖపడొచ్చని కొంతమంది ఆకతాయిలు కొత్త అవతారం ఎత్తారు. బంగారం ధరలు కొండెక్కడం కష్టపడకుండా లక్షల రూపాయలు సంపాదించ వచ్చని ఆ దోపిడీగాళ్లు బుద్ధారం గండే అడ్డగా మార్చుకుని దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. వనపర్తి జిల్లా గోపాలపేట మండలం బుద్ధారం గ్రామం బుద్ధారం గ్రా మానికి వన్నెతెచ్చిన గండే దోపిడీగాల అడ్డ అయింది.
గత ఐదేళ్ల క్రితం హైదరాబాదు నుండి వనపర్తికి రావాలంటే ఈ బుద్ధారం గండి దాటాల్సిందే. అప్పట్లో గుద్దరం గండి పై దోపిడి దొంగలు మఖాం వేసి దోచుకునేవారు. ఈ దారి గుండా చిన్నచిన్న పల్లె టూర్లకు వాహనాలపై రావాలంటే భయం భయంతో చేస్తుండేవారు దొంగలు గండిలో కాపు కాసి కొట్టి డబ్బులు నగలు దోచుకెళ్తుండడంజరుగుతుంది. ఈ సంఘటనలు తర చూ జరుగుతున్నాయి అని ప్రజలు ప్రయాణికులు వాపోతున్నారు.
దీంతో బుద్ధారం గండిలో పోలీస్ పికెట్ తోపాటు నైట్ పెట్రోలింగ్ ఏర్పాటుచేసి ముమ్మరంగా దొంగల కోసం కాలించేవారు .కానీ ప్రస్తుతం పోలీసుల పెట్రోలింగ్ చేయడం కనుమరుగ యింది దీంతో దొంగలకు దోపిడీ గాళ్ళకు దోచుకోవడానికి అనువుగా మార్గం తోడైం ది. బుద్ధారం గండి నుండి ఏముగుంట రోడ్డు వైపుగా దోపిడి గార్లు దారి కాపులు కా స్తున్నారు. కష్టం చేస్తే ఫలితం లేదని దోపిడీ చేస్తే లక్షల సంపాదించవచ్చను కున్న దోపిడీ దొంగలకు ఈజీగా మారింది.
కారులో వచ్చి న వారిని ఆపి కత్తులతో బెదిరించి మెడలో ఉన్న ఆభరణాలు చేరుకున్న ఉంగరాలు నగ దు డబ్బు లాంటివి ఏవి ఉన్నా వదలకుండా దోచుకెళ్తున్నారు. దీంతో రాత్రిళ్ళు ఈ దారి గుండా ప్రయాణం చేయాలంటే ప్రజ లు భ యపడి రాత్రి 7వ తే చాలు అంతా చీకటిమ యం ఈ రోడ్డు అంతా నిర్మానుషంగా మా రిపోతుంది. ఇటీవలే కొంతమంది దోపిడీగాళ్లు కత్తులు చూయించి దోపిడీ చేసిన సం ఘటనలు ప్రజలకు తెలిసింది.
15 రోజు ల క్రితం కొంతమంది దోపిడీగాళ్లు కారులో వ స్తున్న వారిని బైక్ లో వస్తున్న వారిని బెదిరించి దూసుకెళ్లారు. గతంలో కూడా ఉలికె పాడు వెళ్లాలంటే ప్రజలు భయపడేవారు రాను రాను పోలికపాడు రోడ్డుపై దొంగతనాలు తగ్గుముఖం పట్టాక బుద్ధారం గం డిలో ఊపందుకున్నాయి. ఉత్తరం గండి ఆలయంలో నిద్ర చేయాలంటే ప్రజలు భయ భ్రాంతులకు గురవుతున్నారు.
అంతేకాకుం డా బుద్ధారం గండి నుండి వనపర్తి కి వెళ్లే దారి రాత్రి 12:30 అయ్యాక దోపిడీ దొంగ లు కాపు కాస్తారని ఇటువైపు కూడా ప్రయా ణం ప్రజలు విరమించుకున్నారని చర్చించుకుంటున్నారు.పోలీస్ అధికారులు బుద్ధారం గండి నుంచి వేముకుంట జంగమాంబ పల్లి రోడ్డు వరకు పోలీసులు కాపు కాసి దోపిడి దొంగలను పట్టుకొని వారి పని పట్టాలని ప్రజలు కోరుతున్నారు.