20-05-2025 01:09:41 AM
మంథని, మే 19 (విజయక్రాంతి): సరస్వతీ పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం వచ్చి, గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదు ల త్రివేణి సంగమంలో స్నానమాచరించడం సంతోషంగా ఉన్నదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ పుష్కరాలకు సోమవారం బండి సంజయ్ తన సతీమణి అపర్ణతో కలిసి హాజరయ్యారు. వారికి కలెక్టర్, ఎస్పీ, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.
5వ రోజు సోమవారం కాళేశ్వరంలో సంవిదానంద సరస్వతి మహా మం డలేశ్వర స్వామి త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. సరస్వతీ ఘాట్, ముక్తేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకట్ రావు, ఆలయ అధికారులు మండలేశ్వరస్వామిని సత్కరించారు. కాగా పండితుల వేద మంత్రోచ్ఛరణ మధ్య బండి సంజయ్ దంపతులు సరస్వతీ నదీమ తల్లి పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం ముక్తేశ్వ రుడిని ద ర్శించుకున్నారు.
ఈ సం దర్భంగా బండి సం జయ్ మాట్లాడుతూ.. దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని, నరేంద్రమోదీ నాయకత్వంలో దేశానికి మరింతగా సేవలందించేలా దీవించా లని ముక్తేశ్వర స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. కాళేశ్వరాన్ని అద్భుతమైన అధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కుంభమేళాలో 50 కోట్ల మంది భక్తులకు తమ ప్రభుత్వం ఆతిథ్యమిచ్చిందని, కాళేశ్వరం పుష్కరాలకు వచ్చే 50 లక్షల మందికి ఆతిథ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
సరస్వతీ పుష్కరాలకు కేవలం రూ.35 కోట్లు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం కేటాయించిందని, ఆ నిధులు సరిపోవని మరిన్ని నిధులు కేటాయించాలని సూచించారు. ఆయన వెంట బీజేపీ నాయకులు చంద్రుపట్ల సునీల్‌రెడ్డి, నారాయణ రెడ్డి ఉన్నారు. హైకోర్టు న్యాయమూర్తి నందికొండ నరసింగారావు దంపతులు కాళేశ్వ రంలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం ఆల యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జిల్లాకు చెందిన అడిషనల్ జూనియ ర్ సివిల్ జడ్జి శ్రీమతి అఖిల, కలెక్టర్ రాహుల్‌శర్మ, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీ సర్ అనితవాని, పీడీఎం కోర్టు సూపరింటెండెంట్ వీ సదానందం న్యాయమూర్తి దం పతులకు ఘనంగా స్వాగతం పలికారు. కలెక్టర్ రాహుల్‌శర్మ న్యాయమూర్తి దంపతు లకు సరస్వతీ మాత చిత్రపటాన్ని అందజేశారు. త్రివేణి సంగమంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, డాక్టర్ ప్రమీల దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానం ఆచరించారు.
భక్తులపై పోలీసుల ప్రతాపం!
కాళేశ్వరం సరస్వతీ పుష్కరాల్లో పోలీసుల ఆగడాలు శృతిమించుతున్నాయి. నిన్నటికి నిన్న కాళేశ్వరం దేవస్థాన ప్రధానార్చకుడు నగేష్‌శర్మని భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ సీఐ గెంటివేసిన సంఘటన మరిచిపోకముందుకే తాజాగా సోమవారం మరో ఘటన పుష్కర భక్తులను కలచివేసింది. తమ పిల్లపాపలతో ద్విచక్ర వాహనంపై పుష్కర స్నానా నికి దంపతులు వచ్చారు. సాధారణ ఘాట్ కు వెళ్తుండగా అక్కడ విధుల్లో ఉన్న మహాముత్తారానికి చెందిన ట్రెయినీ ఎస్సై మహేశ్ వారిపై ప్రతాపం చూపించాడు.
భక్తులను అడ్డుకొని వాహన తాళాలు గుంజుకొని జు లుం ప్రదర్శించాడు. అక్కడే ఉన్న మహిళలు సదరు పోలీస్ అధికారిని గట్టిగా నిలదీశారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తుల పట్ల మీ ప్రవర్తన సరిగా ఉండటం లేదంటూ ఆగ్ర హం వ్యక్తం చేశారు. అదే సమయానికి అటు గా వస్తున్న మరో ఎస్సై పరిస్థితిని గమనించి అక్కడికి వచ్చి ఆరా తీశారు. జరిగిన తప్పిదం గమనించి సదరు ట్రెయినీ ఎస్సైని తాళాలు అప్పగించాలని చెప్పగా ససేమీరా అంటూ తగ్గకపోవడంతో భక్తులు మరింత కోపోద్రిక్తులయ్యారు.
విషయం తెలుసుకున్న ఓ ప్రజాప్రతినిధి అక్కడికి చేరుకుని సదరు ట్రె యినీ ఎస్సైని మందలించడంతో ఆ దంపతులకు వాహన తాళాలు అప్పగించాడు. ఇ లాంటి ఘటనలు భక్తులను కలవరపెడు తున్నాయి. పోలీసుల ఆగడాల వల్ల చాలా మంది భక్తులు దైవ దర్శనం చేసుకోకుండానే పుష్కర స్నానం ఆచరించి వెళ్తిపోతు న్నారు. వీఐపీ పుష్కర ఘాట్ వద్ద డీఎస్పీ స్థాయి అధికారి కూడా భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నాడని భక్తులు తెలిపారు.