calender_icon.png 20 May, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిలాపాపం.. తలా పిడికెడు!

20-05-2025 12:38:58 AM

  1. గుండాల సహకార సంఘంలో రూ.కోటి గోల్‌మాల్? 

పీరియాడిక్ విచారణ పూర్తి... 52వ విచారణ నామమాత్రం 

విచారణ పారదర్శకంగా నిర్వహించాలని రైతుసంఘాల డిమాండ్ 

భద్రాద్రి కొత్తగూడెం మే 19 (విజయ క్రాంతి) తిలాపాపం... తలా పిరికిడు అన్నట్లు ఉంది గుండాల మండల ప్రాథమిక వ్యవసా య సహకార పరపతి సంఘం అవినీతి భాగోతం.  ప్రభుత్వ పథకాలను రైతులకు చేరవేస్తూ, రైతులను నష్టాల భారీ నుంచి కా పాడాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అవినీతి ఊబిలోకి కూరుకుపోయింది.

ఉన్నతాధికారుల పరివేక్షణలేమి, ఆమ్యామ్యాల కారణంగా ప్రజాధనం సుమారు రూ 1 కోటి లూటీ అయింది. ఇప్పటికే సహకార సంఘం అవినీతిపై  పలు ప్రజాసంఘాలు  పూర్తి స్థా యి అవినీతిని వెలుకి తీయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో జిల్లా అధికారులు  పిరియాడిక్ విచారణ నిర్వహించి సుమారు రూ 21 లక్ష గో ల్మాల్ జరిగినట్లు విచారణ అధికారి జిల్లా అధికారికి నివేదిక అందజేశారు.

దీంతో సీ ఈఓ రాంబాబును సస్పెండ్ చేసి, ప్రస్తుతం 52వ విచారణ చేపట్టారు. ఈ తరుణంలో క్రింది స్థాయి అధికారుల నుంచి  జిల్లాస్థా యి అధికారి వరకు పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ప్ర చారం సాగుతోంది. దీంతో విచారణలను నవమాత్రంగా నిర్వహించి అవినీతిపరులను తిరిగి ఉద్యోగంలో తీసుకునే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నా యి.

వివరాల్లోకి వెళితే 2020 నుంచి 2024 సంవత్సర వరకు ప్రజాధనం సుమారు రూ 1 కోటి గోల్మాల్ జరిగినట్లు తెలుస్తోంది. సొసైటీ అవినీతిపై ప్రజాసంఘాలు చేసిన ఫి ర్యాదు మేరకు పిరియాడికల్ విచారణ పూర్తి చేసిన అధికారులు 52వ విచారణను చేపట్టారు. 

వాస్తవంగా గోల్‌మాల్ అయిన నిధుల వివరాలు ఇలా ఉన్నాయి 

కలుపు, పురుగుమందులు, బ్లాక్ లో అమ్మి సొమ్ము చేసుకున్నారని, కాలం చెల్లిన యూరియా కారణంగా రూ 9.50 లక్షలు, యూరియా బస్తాకు రూ 16 చొప్పున 199 లారీలకు చెల్లించాల్సినవి రూ 14.49 లక్షలు, ఆళ్లపల్లి మండల కేంద్రంలో గోదాము నిర్వహణకు తప్పు డు అగ్రిమెంట్ ద్వారా రూ1 లక్ష, మార్క్ఫెడ్ వరుణ్ కుమా ర్ విచారణలో రూ 22 లక్షల గోల్మాల్, వజ్జ రామ్మూర్తి అనే అతన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగంలోకి తీసుకొని చెల్లించిన వేతనాలు, ఏరియాస్ రూ 49 వేలు, నోడ్యూస్ సర్టిఫికెట్ ద్వారా రైతుల నుంచి రూ 5,000 చొ ప్పున వసూలు చేసినవి రూ 10 లక్షలు, పెంచిన రుణాలపై రైతుల వద్ద నుంచి 20 20 నుంచి ఇప్పటివరకు బస్సులు చేసినవి రూ 15 లక్షలు, సొసైటీ మేనేజర్, సీఈవో లు దొంగ సంతకాలతో డ్రా చేసినవి రూ 50వేలు,

ఆయాలకు మెటర్నటీ లీవ్ ఇవ్వకుండా ఇచ్చినట్లు చూపి రూ 1.47 లక్షలు ఇలా సుమారు రూ 1 కోటి వరకు అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. గోనెసంచుల అక్రమాలపై ఆరోపించబడ్డ వ్యక్తి విచారణకు హాజరు కాకపోవడం గమనార్హం. అవినీతి పై అధికారులు అందిన కాడికి పుచ్చుకొని నామమాత్రపు విచారణ చేసి ఫైల్ మూసే ప్రయత్నం చేస్తున్నారని విశ్వాసనీయ సమాచారం.

దీంతో పాటు సహకార సంఘంలో చేపట్టిన 52 విచారణ కీలకము కావడంతో ఆ విచారణను జిల్లా సహకార సంఘం కార్యాలయం సూపరిండెండెంట్ స్థాయి అధికారిని నియమించి విచారణ చేపట్టారు. చేపట్టిన విచారణ పారదర్శకంగా చేయకుం డా కార్యాలయంలోనే కూర్చొని తూతూ మంత్రంగా విచారణ నిర్వహిస్తున్నట్లు  రైతు సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి.

అందు కు అధికారులకు పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు తెలుస్తోంది. త్వరలో డి సి ఓ రిటైర్మెంట్  నేపథ్యంలో నవమాత్రంగా నివేదిక సమర్పించి తిరిగి అవినీతిపరులకే విధులు కేటాయించే ప్రయత్నాలు సాగుతున్నట్లు విశ్వాస నియాస సమాచారం. గుండా ల సహకార సంఘం అవినీతిపై జిల్లా కలెక్టర్, సహకార సంఘం ఉన్నతాధికారులు దృష్టి సారించి ప్రజాధనాన్ని దిగమింగిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, గోల్మాల్ అయిన ప్రజాధనాన్ని రికవరీ చే యాలని రైతులు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.

ఈ విషయమై డి సి ఓ కుర్షిద్ ను వివరణ కోరగా గుండాల సహకార సం ఘం అక్రమాలపై ఇప్పటికే  పిరాడికల్ ఎంక్వైరీ నిర్వహించామని, సీఈఓ రాంబాబును సస్పెండ్ చేశామన్నారు. ప్రస్తుతం 52 ఎంక్వయిరీ నిర్వహిస్తున్నామని విచారణ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. విచారణ నామ మాత్రంగా నిర్వ హించి నేరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని వచ్చిన ఆరోపణ లు ఆయన దృష్టికి తీసుకెళ్లగా నివేదికలు సమర్పిస్తే గాని వాస్తవాలు తెలియదన్నారు.