calender_icon.png 25 September, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండుగకైనా పరిశుభ్రత ఉండదా.?

25-09-2025 12:55:31 AM

మహబూబాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): పండుగల నేపథ్యంలో మహబూబాబాద్ పట్టణంలో పారిశుద్ధ్య సమస్య పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను మున్సిపల్ సిపిఐ మాజీ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారధి రెడ్డి కోరారు. మున్సిపాలిటీ పరిధిలోని పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉందని వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరుతూ బుధవారం ఆయన 22వ వార్డులో మున్సిపల్ అధికారులకు, సానిటరీ ఇన్స్పెక్టర్ కరుణాకర్ కు సమస్యను వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉందని సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. వార్డుల్లోని వివిధ ప్రాంతాల్లో, శివారు కాలనీల్లో పారిశుద్ధ్య సమస్యను తక్షణం పరిష్కరించడానికి మున్సిపల్ కమిషనర్, అధికారులు ప్రత్యేక చొరవ చూపి వెంటనే శుభ్రం చేసే విధంగా గ్యాంగ్ వర్క్ లు నిర్వహించి పారిశుధ్య సమస్య లేకుండా చేయాలని కోరారు. దసరా పండుగ నాటికి ప్రజలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. 22వ వార్డులోని కంకర బోర్డ్ లో రోడ్ల వెంబడి ఉన్న చెత్తాచెదారాన్ని  తొలగించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పెరుగు కుమార్, వీరవెల్లి రవి, డి.రమేష్, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.