calender_icon.png 25 September, 2025 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం..

25-09-2025 12:52:32 AM

  1. పంటలను ధ్వంసం చేయడమెందుకు..? 

ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలి

సీపీఎం రాష్ట కమిటీ సభ్యుడు అన్నవరపు కనకయ్య

మణుగూరు, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి) : మండలం రేగులగండి గ్రామంలో గత 20 ఏళ్లకు పైగా గిరిజన రైతుల సాగులో ఉన్న భూ ముల్లో పంటలను ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారులపై చర్య లు తీసుకోవాలని సీపీఎం రాష్ట కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సిపిఎం జిల్లా ప్రతినిధి బృందం మండలంలో పర్యటించి ద్వసం అయినా పంట చేనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా కనకయ్య మాట్లాడుతూ, గిరిజన రైతులు చీమల రమేష్, మడకం గుడ్డిలకు చెంది న రెండు ఎకరాల వరి,పత్తి చేనులో ఫారెస్టు అధి కారులు గడ్డి మందు స్ప్రే చేసి గిరిజనుల పంటను ధ్వంసం చేశారన్నారు. జిల్లాలో ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంటను ధ్వంసం చేస్తూ, తిరిగి ఆదివాసీ లపైనే కేసులునమోదు చేస్తున్నట్లు తెలిపారు.

పత్తి చేలు మొత్తం పిందె పడి కాయదశ కు వచ్చిందని, చేతికివచ్చిన పంటను ఫారెస్ట్ అధికారులు నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారులు అక్రమంగా పంటలను ధ్వంసం చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అటవీ హక్కుల చట్టం, పిసా తీర్మాణాలను ఉల్లం ఘిస్తున్న ఫారెస్ట్ అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, పంట నతీసుకోవాలనిరైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారులు దాడులు ఆపకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలు నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న, మండల కార్యదర్శి సత్రపల్లి సాంబశివ రావు , మండల నాయకులు కోడిశాల రాములు,దామల్ల వెంకన్న గ్రామ గిరిజన రైతులు పాల్గొన్నారు.