25-09-2025 12:58:20 AM
పట్టణంలో పలుచోట్ల వ్యభిచార గృహాలు?
విచ్చలవిడగా గంజాయి వాడకాలు?
ఆందోళనలో పట్టణవాసులు
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతమైన పాల్వం చ పట్టణంలో గత కొంతకాలంగా శాంతిభద్రతలు కొరవడిందని, అసాంఘిక కార్యకలా పాలకు పాల్వంచ నిలయంగా మారిందని ఆరోపణలు వెలువడుతున్నాయి. పట్టణం లో పలుచోట్ల వ్యభిచార గృహాలు ఏదేచ్ఛగా సాగుతున్నట్లు తెలుస్తోంది.
ప్రముఖుల నివాసం ఉండే కాంట్రాక్ట్ కాలనీలో, కార్మికు లు అధికంగా ఉండే ప్రశాంత్ కాలనీలో ఈ గృహాలు నడుస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. గిరిజన ప్రాంతాల నుంచి అ మ్మాయిల్ని తరలించి రాత్రి, పగలు తేడా లే కుండా వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్న అటువైపు పోలీ సులు కన్నెత్తి కూడా చూడకపోవడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది.
దీంతో యువ త పెడదారి పట్టుకున్నట్లు ఆందోళనలు వెలబడుతున్నాయి. దీనికి తోడు పట్టణంలో గం జాయి వాడకం విచ్చల విడిగా పెరిగిందని, తగాదాలకు నిలయంగా మారిందని తెలుస్తోంది. ఇటీ సీతారాంపట్నానికి చెందిన ఒక యువకుడు పట్టపగలే మూడు, నాలుగు చో ట్ల తగాదాకు దిగటం నిదర్శనం. శ్రీకాకుళం వ్యాపారి దుకాణంలో చొరబడి కొట్టినట్లు తె లుస్తోంది.
సదరు ఆ వ్యాపారి పోలీస్ స్టేష న్లో ఫిర్యాదు చేసిన, మంత్ర దృష్టికి విషయా న్ని తీసుకెళ్లిన, స్టేషన్లో చేయి తడపనిదే ఎఫ్‌ఐఆర్ కాలేదని ప్రచారం సాగుతోంది. ఈ నెల 7వ తేదీన నవభారత్ కూడలిలో పట్టపగలే కొంతమంది యువకులు మంగలి షా పులో పనిచేసే ఇంటికి వస్తున్న క్రమంలో దా రికాచి కొట్టడం, అతనికి చేతికి బలమైన గాయాలై మూడు కుట్లు పడ్డాయి. స్టేషన్లో ఫి ర్యాదు చేస్తే పిటి కేసు పెట్టి పంపించడం గమనార్హం.
అకతాయల ఆగడాలకు ఇవి మ చ్చుతునకలు మాత్రమే. ట్రాఫిక్ సమస్యకు వస్తే ఆంధ్రాబ్యాంక్, అంబేద్కర్ సెంటర్, ము న్సిపాలిటీ రోడ్డు, శాస్త్రి రోడ్లో, బస్టాండు, ద మ్మపేట సెంటర్లలో నడవడమే కష్టంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఆటోలు బండ్లు అడ్డదిడ్డంగా రోడ్లపైనే ముంచటంతో రాకపోకలకు తీవ్ర అంతరా యం ఏర్పడుతోంది.
జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న పాల్వంచ పట్టణంలో ఇలాంటి పరిస్థితి ఉన్న పోలీసు ఉన్నతాధికారులు నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తున్నా రని విమర్శలు వెలవడుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఎస్పీ పాల్వంచ పట్టణం పై ప్రత్యేక దృష్టి సారించి శాంతి భద్రతలను పరిరక్షించాలని, సాంఘిక కార్యక్రమాలను అరికట్టాలని, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.