23-07-2025 12:33:17 AM
కొట్టిపారేస్తూ ప్రకటన విడుదల చేసిన వైట్ హౌస్
న్యూయార్క్, జూలై 22: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆ దేశానికి చెందిన ఆర్టిస్ట్ మారియా ఫార్మర్ సంచలన ఆరోపణలు చేశా రు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇం టర్వ్యూ సందర్భంగా తన అనుభవా న్ని పంచుకున్నారు. 1995లో తాను ఎప్‌స్టీన్ కోసం పనిచేయడానికి సిద్ధమవుతున్నానని చెప్పారు. ఒకరోజు ఎప్‌స్టీన్ ఫోన్ చేసి తనను మాన్‌హట్టన్‌లోని ఆఫీసులో కలవాలని ఫోన్ చేసినట్టు తెలిపారు.
తాను రన్నింగ్ షార్ట్స్ ధరించే ఆఫీసుకు వెళ్లినట్టు పేర్కొన్నారు. అదే సమయంలో ట్ర ప్ బిజినెస్ సూట్‌లో అక్కడికి వచ్చారని గుర్తు చేశారు. ట్రంప్ తన కాళ్ల వైపు అదే పనిగా చూడటాన్ని గమనించినట్టు తెలిపారు. తనకు చాలా భయమేయగా.. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఎప్‌స్టీన్ ‘ఆమె మీకోసం రాలేదు’ అంటూ ట్రంప్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లారు.
కాగా మారియా వ్యాఖ్యలను కొట్టిపారేస్తూ వైట్‌హౌస్ మంగళవారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎప్‌స్టీన్‌తో స్నేహాన్ని ట్రంప్ వదిలేసి చాలాకాలం అవుతోందని పేర్కొంది. ఎప్‌స్టీన్ చెత్త ప్రవర్తనతో విసిగిపోయిన ట్రంప్ అతడిని క్లబ్ నుంచి వెళ్లగొట్టారన్నారు.