25-12-2025 01:26:19 AM
శ్రీహరికోట, డిసెంబర్ 24: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురా యిని అధిగమించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం చేపట్టిన ‘బాహుబలి’ రాకెట్ ఎల్వీఎం ఎం6 ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగంలో అమెరికాకు చెం దిన అధునాతన కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూ బర్డ్ బ్లాక్ ఇస్రో విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.
ఈ ప్రయోగం భారతీయ అంతరిక్ష రంగ చరిత్రలో అతిపెద్ద వాణిజ్య విజయంగా నిలిచిపోయింది. ఉద యం 8:55 గంటలకు రెండో లాంచ్ ప్యాడ్ నుంచి 43.5 మీటర్ల ఎత్తున్న ఎల్వీఎం3 రాకెట్ నింగిలోకి ఎగిసింది. ప్రయాణం మొదలైన 15 నిమిషాలకే లక్ష్యానికి చేరుకుని, భూమికి 520 కిలోమీటర్ల ఎత్తులో ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది. 6,100 కిలోల బరువున్న ఈ బ్లూబర్డ్ ఉపగ్రహం భారత గడ్డపై నుంచి ప్రయోగించిన అత్యంత భారీ ఉపగ్రహంగా రికార్డు సృష్టించింది.
90 సెకన్ల పాటు ఆలస్యం చేసి..
ఈ ప్రయోగంలో ఒక ఆసక్తికరమైన మలుపు చోటుచేసుకుంది. ముందుగా ఉద యం 8:54 గంటలకే రాకెట్ బయలుదేరాల్సి ఉంది. కానీ రాకెట్ వెళ్లే మార్గంలో అంతరిక్ష వ్యర్థాలు, లేదా ఇతర ఉపగ్రహాలు ఢీకొనే ప్రమాదం ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన ఇస్రో, కచ్చితమైన సమయ పాలనతో ప్రయోగాన్ని 90 సెకన్ల పాటు ఆలస్యం చేసి, 8:55 గంటల 30 సెకన్లకు ప్రయోగించింది.
తద్వా రా పెను ప్రమాదాన్ని నివారించి విజయా న్ని అందుకుంది. ఉపగ్రహం బరువు సుమా రు 6,100 కిలోలు, అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. బ్లూబర్డ్ సక్సెస్ కావడంతో ఇస్రో కేంద్రంలో సంబరాలు అంబరాన్నంటాయి.
శాస్త్రవేత్తలకు ఇస్రో చైర్మన్ అభినందన
శ్రీహరికోట నుంచి చేపట్టిన ఎల్వీఎం -ఎం6 రాకెట్ ప్రయోగం విజయవంతంగా నింగిలోకి చేరుకోవడంతో షార్‌లో సంబరాలు అంబరాన్నంటాయి. ప్రయోగం విజ యవంతం కావడానికి అహర్నిశలు కృషి చేసిన శాస్త్రవేత్తలను ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎల్వీఎం రాకె ట్ తన అద్భుతమైన ట్రాక్ రికార్డును మరోసారి నిరూపించుకుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ రాకెట్లలో ఇదొకటని నిరూపితమైంది‘ అని సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఇస్రో చేపట్టిన మూడవ పూర్తిస్థాయి వాణిజ్య మిషన్ కావడం విశేషం.
ప్రధాని నరేంద్ర మోదీ హర్షం
ఎల్వీఎం- రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. శాస్త్ర వేత్తలకు అభినందనలు తెలిపారు. ప్రపంచ వాణిజ్య ప్రయోగాల్లో భారత్ మరోసా రి సత్తా చాటిందని ఇస్రోను కొనియాడారు. అంతరిక్ష రంగంలో మన దేశం అత్యున్నత స్థాయికి ఎదుగుతూనే ఉందన్నారు. ఈ విషయం ఆత్మనిర్భర్ భారత్ వైపు ప్రయత్నాలను ప్రతిబింబిస్తూనే ఉందని ఎక్స్ వేదికగా వెల్లడించారు.