calender_icon.png 25 December, 2025 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎత్తిపోతల పథకం కేవలం రాజకీయ నినాదమే

25-12-2025 03:03:58 AM

జాగృతి జిల్లా అధ్యక్షులు కప్పాటి పాండురంగారెడ్డి

కందుకూరు, డిసెంబర్ 24 (విజయక్రాంతి) : పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకం కేవలం ఒక రాజకీయ నినాదమే అని జాగృతి జిల్లా అధ్యక్షులు కప్పాటి పాండురంగారెడ్డి అన్నారు. బుధవారం,జాగృతి ఇంచార్జ్ చీమల రమేశ్,జాగృతి సీనియర్ నియోజకవర్గ నాయకులు చలసాని విష్ణుమూర్తి,నాగని ప్రకాశ్ లతో కలసి  నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టిఅర్‌ఎస్ తెలంగాణ ఉద్యమ నినాదంలో నీళ్ళు,నిధులు,నియమకాలు అందులో ’నీళ్లు’ మొదటి అంశమని,పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన అనంతరం వెనక్కి తిరిగి చూస్తే దక్షిణ తెలంగాణకు గుండెకాయ వంటి ’పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకం కేవలం ఒక రాజకీయ నినాదంగానే ఉండి పోయిందే తప్ప  ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి,జిల్లా ప్రజలకు పెద్దగా ఒనగూరింది ఏమి లేదన్నారు.

బీఆర్‌ఎస్ హయాంలోనే కూలిపో యిన కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలోనే పూర్తి చేశామని చెప్పుకొనే బిఅర్‌ఎస్ పాలమూరు ప్రాజెక్టును మాత్రం పదేళ్లపాటు పాతరేశారని ఆయన మండి పడ్డారు. ఇప్పుడు నిద్రలేసిన బిఅర్‌ఎస్ నాయకులు ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పై అవలంబిస్తున్న విధానం వల్ల 90 టీఎంసీల నుంచి 45 టీఎంసీలకు తగ్గించేలా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల కుట్రల వల్ల జిల్లాల ప్రజలకు తీవ్ర నష్టం  జరుగుతుంది అని అన్నారు.

మొసలి కన్నీరు కారుస్తు రాజకీయ ఉనికికోసం మభ్యపెడుతున్నరని ఆయన మడిపడ్డారు.బిఆర్‌ఎస్,బీజేపీతో ఉన్న స్నేహా న్ని కేవలం తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారే తప్ప, తెలంగాణ ప్రాజెక్ట్ కు అనుమతుల కోసం ఒత్తిడి చేయలేదని అన్నారు. కేంద్రం పాలమూరు డీపీఆర్‌ను వెనక్కి పంపిందంటే దానికి కార ణం బిఅర్‌ఎస్,కాంగ్రెస్ ప్రభుత్వాల బాధ్యతరాహిత్యమని ఆయన మండిపడ్డారు.