calender_icon.png 25 December, 2025 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధరల పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించాలి

25-12-2025 03:02:24 AM

  1. రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి ఉషా

మండలంలో ఎరువుల దుకాణాల  తనిఖీ 

మొయినాబాద్, డిసెంబరు24(విజయ క్రాంతి): ఎరువుల దుకాణాల్లో తప్పనిసరిగా స్టాక్, ధరల పట్టికను ప్రదర్శించి నిత్యం నవీకరించాలని రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి ఉషా దుకాణదారులను అదేశించారు. బుధవారం ఆమె మొయినాబాద్ మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా డీలర్ల వద్ద నిర్వహిస్తున్న బుక్ బ్యాలెన్స్, గ్రౌండ్ బ్యాలెన్స్, స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. అనం తరం ఆమె మాట్లాడుతూ ఎరువులను ఎంఆర్పీ ధరలకే విక్రయించాలని, నిబంధనలకు విరుద్దంగా విక్రయిస్తే కఠిన చర్యలు, శిక్షలు తప్పవని హెచ్చరించారు.

ప్రతి ఎరువు విక్రయానికి రైతులకు బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. త్వరలోనే కొత్త ఎరువుల యాప్ ప్రారంభం కానుందని, ప్రస్తుతం దానికి సంబందించిన ట్రయల్స్ కొనసాగుతున్నాయని తెలిపారు. ఎరువులు పొందేందుకు ఈ యాప్ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. వ్యవసాయ శాఖ చేపడుతున్న ఈ కొత్త విధానాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని.. డీలర్లు కూడా సహకరించాలని సూచించారు. అనంతరం వ్యవసాయ శాఖ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. ఆమె వెంట మండల వ్యవసాయ అధికారి అనురాధ, సిబ్బంది ఉన్నారు.