25-12-2025 01:09:59 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 24 (విజయక్రాంతి): రవాణా శాఖలో అవినీతికి పాల్పడి రూ. 250 కోట్ల సా మ్రాజ్యాన్ని నిర్మించుకున్న మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (డీటీసీ) కిషన్ నాయక్ కేసులో సినిమా కథను తలపించే ట్విస్టులు వెలుగుచూస్తున్నాయి. ఓ వైపు స్టార్ హోటల్లో పా ట్నర్ గా, వందల ఎకరాలకు భూస్వామి గా ఉన్న ఈ అధికారి.. తన ఇంటి పక్కన వా రికి మాత్రం తాను ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నని నమ్మబలికిన వైనం ఏసీబీ అధి కారులనే విస్మయానికి గురిచేసింది.
అంతేకాదు, తన అక్రమ సంపాదనను దాచేందుకు తన ప్రైవేట్ డ్రైవర్‌నే బినామీగా మార్చుకున్నట్లు దర్యాప్తులో తేలిం ది. కిషన్ నాయక్ వద్ద ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఏనుగు శివశంకర్ ఈ కథ లో కీలక పాత్రధారిగా మారాడు. కిషన్ నాయక్ అక్రమ లావాదేవీలన్నీ ఇతని కనుసన్నల్లోనే సాగినట్లు ఏసీబీ అనుమానిస్తోంది. నెలకు వేలల్లో జీతం తీసుకునే డ్రైవర్ శివశంకర్ పేరు మీద ఏకంగా మూడు కార్లు రిజిస్టర్ అయి ఉండటం అధికారులను షాక్‌కు గురిచేసింది.
కిషన్ నాయక్‌కు చెందిన భారీ మొత్తంలో నగదు, మరికొన్ని విలువైన స్థలాలు డ్రైవర్ శివశంకర్ పేరు మీదనే ఉన్నట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. కిషన్ నాయక్ ఇంటిపై ఏసీబీ దాడులు జరగగానే, విషయం తెలుసుకున్న డ్రైవర్ శివ శంకర్ పరారయ్యాడు. అతడు పట్టుబడి తే డీటీసీ అక్రమాస్తుల చిట్టా మొత్తం బ యటకు వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగినని..
అల్వాల్‌లో కిషన్ నాయక్ నివాసముంటున్న అత్యాధునిక భవనంలో సోదాలు చేసిన అధికారులకు మరో విచిత్రమైన విషయం తెలిసింది. ఆ భవనం కింది అంతస్తులో నివసించే వారికి, చుట్టుపక్కల వారికి కిషన్ నాయక్ తాను ఒక ప్రభుత్వ అధికారిని అని చెప్పుకోలేదు. తాను ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అని పరిచయం చేసుకున్నారు. తన విలాసవంతమైన జీవితానికి, అక్రమ సంపాదనకు ప్రభుత్వ ఉద్యోగం అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతోనే ఈ టెక్కీ నాటకం ఆడినట్లు దర్యాప్తులో తేలింది.
మంగళవారం జరిగిన సోదాల్లో బయటపడిన కిషన్ నాయక్ ఆస్తుల చిట్టా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల వివరాలు నిజామాబాద్ నడిబొడ్డున ఉన్న లహరి ఇంటర్నేషనల్ స్టార్ హోటల్లో ఏకంగా 50 శాతం వాటా, నారాయణఖేడ్, నిజామాబాద్ పరిసరాల్లో కలిపి మొత్తం 41 ఎకరాల వ్యవసాయ భూమి, ఫర్నిచర్ షాపునకు ఇచ్చిన 3,000 గజాల కమర్షియల్ స్థలం.
అశోక్ టౌన్‌షిప్‌లో రెండు ప్ల్లాట్లు, ఒక పాలీ హౌస్, కిలో బంగారం, బ్యాంకుల్లో రూ. 1.37 కోట్ల నిల్వలు, ప్రభుత్వ విలువ ప్రకారమే వీటి విలువ కోట్లలో ఉండగా, మార్కెట్ విలువ రూ. 250 కోట్లు దాటుతుందని అంచనా. ప్రస్తుతం పరారీలో ఉన్న డ్రైవర్ శివశంకర్ కోసం ఏసీబీ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
డ్రైవరే కీలకం
కిషన్ నాయక్ బినామీ సామ్రాజ్యానికి డ్రైవర్ శివశంకర్ కీలకంగా మారాడు. అధికారుల కళ్లు గప్పేందుకు ఆస్తులను డ్రైవర్ పేరున రిజిస్టర్ చేయించడమే కాకుండా, నగదు నిల్వలను కూడా అతడి ద్వారానే చలామణి చేసినట్లు సమాచారం. శివశంకర్ దొరికితే ఇంకా ఎన్ని వందల కోట్లు బయటపడతాయోనని రవాణా శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది.