calender_icon.png 25 December, 2025 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటుదాం

25-12-2025 03:01:04 AM

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి 

చేవెళ్ల, డిసెంబర్ 24(విజయక్రాంతి): బీజేపీ పార్టీ పై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందనదానికి పల్లె పోరు లో తమ పార్టీ అభ్యర్థుల గెలుపే నిదర్శనం అని చేవెళ్ల ఎంపీ  కొండా విశ్వేశ్వ రెడ్డి అన్నారు. బుధవారం చేవెళ్ల నియోజకవర్గం లో నియోజకవర్గ స్థాయి లో  నూతనంగా ఎన్నికైన బీజేపీ బలపర్చిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్లను పార్టీ  ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  పాల్గొన్న చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం లు గెలుపొందిన సర్పంచ్, వార్డు సభ్యుల ను ఘనంగా సన్మానం చేసి అభినదించారు.ఈ సందర్భంగా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం లో బీజేపీ పార్టీ బలంగా ఉందని రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తంచేశారు.