calender_icon.png 23 October, 2025 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయాభివృద్ధికి కృషిచేసే అవకాశం కల్పించడం గొప్ప విషయం

23-10-2025 02:20:17 AM

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

కామారెడ్డి, అక్టోబర్ 22 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో అతి పురాతనమైన స్వయంభు సిద్ధ రామేశ్వర ఆలయం అభివృద్ధికి అవకాశం రావడం గొప్ప విషయమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. బుధవారం భిక్కనూరు మండల కేంద్రంలోని సిద్ధ రామేశ్వర ఆలయం నూ తన పునర్ నిర్మాణ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

సిద్ధరామేశ్వర స్వామి ఆలయ పున ర్నిర్మాణ కమిటీ చైర్మన్ గా, తాటిపాముల లింబాద్రి, వైస్ చైర్మన్ గా అందే దయాకర్ రెడ్డి, డైరెక్టర్లుగా, సింగారపు నర్సమ్మ, నీలా అంజయ్య, అనుగు అమృత, సామ సంతో ష్ రెడ్డి, పెంజర్ల ఈశ్వర్ రెడ్డి, ముత్తన్న ఓల్ల కిష్టయ్య, నాగర్తి రమేష్ రెడ్డి, గుడిసె నారాయణ, లింగి భాగయ్య, మోకాళ్ళ బాపురెడ్డి, చీకోటి ప్రభాకర్, అక్కు కార్తీక్, లు అభివృద్ధి కమిటీ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశా రు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడు తూ భిక్కనూరు సిద్ధ రామేశ్వర ఆలయం చాలా పురాతన మైనది, మహిమలు గల దేవాలయం అని అన్నారు.సిద్ధ రామేశ్వర ఆలయం ద్వారానే బిక్కనూరు గ్రామానికి దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు.

ఈ ఆలయం నా నియోజకవర్గంలో ఉండడం నా అదృష్టం అని షబ్బీర్ అలీ అన్నారు.నాకు సిద్ధ రామేశ్వర ఆలయ అభివృద్ధి చేసే అవకాశం కల్పించిన సిద్ధ రామేశ్వరుడు అని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు నిజాయితీగా స్వా మి వారి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని మీకు ఈ అవకాశం దొరకడం చాలా గొప్ప విషయమని సిద్ధ రామేశ్వరుని కరుణతోనే మీకు ఈ పదవులు వచ్చాయని దాన్ని గుడి అభివృద్ధితో సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.కోరికలు కోరుకున్న వారికి కోరికలు నెరవేరుతాయని.

ఆలయ దర్శనం చేసుకుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని అన్నారు.ఆలయ అభివృద్ధికి నా వంతు శాయశక్తుల కృషి చేస్తాను అన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కర్‌మాట్లాడుతూ. సిద్ది రామేశ్వర ఆలయానికి నూతనంగా ఎన్నికైన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. సిద్ధ రామేశ్వర ఆల య పునర్నిర్మాణ కమిటీ ప్రమాణ స్వీకార ఉత్సవంలో పాల్గొని స్వామివారినీ దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. షబ్బీర్ అలీ ముస్లిం అయినా ఆలయాల అభివృద్ధిలో ముందు వరుసలో ఉంటారు అని అన్నారు.

సిద్ధ రామేశ్వరాలయం చాలా పురాతనమైనది, మహిమలు గల ఈ ఆలయ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు,గ్రంథాలయ సమస్త చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, పీసీసీ జనరల్ సెక్రెటరీ ఇంద్రకరణ్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మహమ్మద్ ఇలియాస్, ఎడ్ల రాజిరెడ్డి, భీమ్ రెడ్డి, గూడెం శ్రీనివాస్ రెడ్డి, అనంతరెడ్డి, సుతారి రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ లు లక్ష్మిరాజాగౌడ్ , బిక్కనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ జనగామరాజు, మాజీ ఎంపీపీ బల్యాలసుదర్శన్, గోనె శ్రీనివాస్, దేవరాజ్ గౌడ్, ఇంద్రసేనారెడ్డి, లింగారెడ్డి, ఐరెని సందీప్, గంపప్రసాద్, నరసింహారెడ్డి, అంతంపల్లి సుధాకర్ రెడ్డి, గుడుగుల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.