23-10-2025 01:15:16 AM
హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ ఆర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. శ్రీలంకలోని కొలంబోలో జరగబోయే ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ ఎకనామిక్ అండ్ టెక్నాలజీ సమ్మిట్(జీఈటీఎస్) -2025’ సదస్సులో ఆయనకు కీలకోపన్యాసం చేసేందుకు ఆహ్వా నం అందింది. ఈ సదస్సు నవంబర్ 10 నుంచి 12వ తేదీ వరకు కొలంబోలోని ‘ది కింగ్స్‌బరీ హోటల్’లో జరగనుంది.
శ్రీలంక సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తరఫున, జీఈటీఎస్ శ్రీలంక డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఏయూఎల్‌ఏ హిల్మీ ఈ ఆహ్వానాన్ని కేటీఆర్‌కు పంపారు. ఇన్నోవేషన్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ , ప్రాంతీయ సహకారం వంటి అంశాలపై చర్చించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విధాన రూపకర్తలు, పారి శ్రామికవేత్తలు, సాంకేతిక నాయకులను ఈ సదస్సు ఒకే వేదికపైకి తీసుకురానుంది.
డాక్టర్ హిల్మీ తన లేఖలో ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి రంగాలలో తెలంగా ణను భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన కేంద్రంగా తీర్చిదిద్దడంలో కేటీఆర్ పోషించిన ‘విశిష్ట నాయకత్వాన్ని, పాత్రను కొని యాడారు. పెద్ద ఎత్తున పారిశ్రామిక, సాంకేతిక కార్యక్రమాలను ఆయన నడిపించిన విధానం.. అనేక వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు ఒక ఆదర్శంగా నిలిచిందని నిర్వాహకులు పేర్కొన్నారు.
కేటీఆర్ పాల్గొనడం వల్ల ‘దక్షిణ ఆసియాలోని విధాన రూపకర్తలు, పారిశ్రామికవేత్తలు స్ఫూర్తి పొందుతా రని’జీఈ టీఎస్ 2025 సదస్సు కార్యదర్శి తెలిపారు. అలాగే, సాంకేతిక, ఆర్థిక వృద్ధిలో భారతదేశం - శ్రీలంక సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇది దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సదస్సుకు వివిధ దేశాల నుంచి మంత్రులు, పెట్టుబడిదారులు, స్టార్టప్ నాయకులు, ఆవిష్కర్తలు హాజరవుతారని పేర్కొన్నారు.
జల్, జంగల్, జమీన్ స్ఫూర్తిగా కేసీఆర్ పాలన
బీఆర్‌ఎస్ హయాంలో, కేసీఆర్ నేతృత్వంలో కుమ్రం భీమ్ ఇచ్చిన జల్, జంగల్, జమీన్ నినాదమే స్ఫూర్తిగా పాలన అందిం చాం.. వారి ఆశయాల సాధన దిశగా పయనించామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆదివాసీ యోధుడు.. తిరుగుబాటు వీరుడు.. గోండు బెబ్బులి కుమ్రం (కొమురం) భీమ్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి బుధవారం ట్విట్ట ర్ వేదికగా ఘన నివాళులు అర్పించారు.
కేసీఆర్ హయాంలో ఆసిఫాబాద్ జిల్లాకు కుమ్రం భీమ్ పేరు పెట్టుకున్నందుకు, జోడేఘాట్‌లో సుందరమైన స్మృతి వనాన్ని ఏ ర్పాటు చేసినందుకు, హైదరాబాద్ మహానగరంలో కుమ్రం భీమ్ పేరిట ఆదివాసీ భవ నాన్ని నిర్మించినందుకు గర్విస్తున్నామని పేర్కొన్నారు.
అస్తిత్వ పోరాటాలకు ప్రతీకగా నిలిచిన కుమ్రం భీమ్ కు జోహార్లు అని రాసుకొచ్చారు. కొమురం భీం పోరాట చరి త్ర నిత్య స్ఫూర్తి అని, ఆయన ఆశయ సాధనకు ఆయన అడుగుజాడల్లో ముందుకు సాగుదామనితెలిపారు. ఆదివాసీల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన యోధుడు భీం అన్నారు.