calender_icon.png 23 October, 2025 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదం అంచున ట్రాన్స్‌ఫార్మర్!

23-10-2025 01:44:02 AM

  1. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పెరిగిన పొదలు
  2. గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుటే నిర్లక్ష్యం
  3. పట్టించుకోని గ్రామ పంచాయతీ

వెంకటాపూర్(రామప్ప), అక్టోబర్22,(విజయక్రాంతి): ములుగు జిల్లా వెంకటపూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పెరిగిన పొదలు, పిచ్చిమొక్కలు ప్రజల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. విద్యుత్ సరఫరా వ్యవస్థలో కీలకమైన ట్రాన్స్ఫార్మర్ చుట్టుపక్కల భాగం పూర్తిగా మొక్కలతో కప్పుకుపోవడం వల్ల ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశముందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామంలోని ప్రధాన వీధి పక్కనే ఉన్న ఈ ట్రాన్స్ఫార్మర్ కొద్ది రోజులుగా చెత్త, పొదలతో కప్పుకుపోయి ఉంది. విద్యుత్ తీగలు తక్కువ ఎత్తులో ఉండటంతో పాటు, దాని చుట్టూ పెరిగిన పొదలు మరింత ప్రమాదానికి దారి తీసేలా ఉన్నాయి. వర్షాకాలం కారణంగా తేమ ఎక్కువగా ఉండడం, గడ్డి మొక్కలు వేగంగా పెరగడం వల్ల విద్యుత్ లీకేజీ, షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

అటు వైపుగా షాప్ కి, ఇంటికి వెళ్లే విద్యార్థులు, చిన్న పిల్లలు, ఇంటి వాళ్ళు ఈ ట్రాన్స్ఫార్మర్ పక్కగా వెళ్లాల్సి వస్తోంది. ఎప్పుడైనా చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇలాంటి నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరిగిన ఉదాహరణలు ఉన్నాయని వారు గుర్తుచేశారు. విద్యు త్ శాఖ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

ఎప్పటిక ప్పుడు బిల్లులు వసూలు చేస్తారు కానీ గ్రా మాల్లోని ట్రాన్స్ఫార్మర్ల పరిస్థితిని పరిశీలించే వారే లేరు. పొదలు, చెత్తతో కప్పుకుపోయిన ఈ ట్రాన్స్ఫార్మర్ను శుభ్రం చేయకపోతే పెద్ద ప్రమాదం తప్పదని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంటనే స్పందించి, ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఉన్న పొదలను తొలగించి, భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా ఇలాంటి సమస్యలు ఉన్న వేరే ట్రాన్స్ఫార్మర్స్ వద్ద మరియు ఇతర గ్రామాల్లో కూడా తక్షణమే శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

సార్లు.. జర పట్టించుకోండి

మా గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ చు ట్టూ పొదలు బా గా పెరిగిపోయా యి సార్. విద్యు త్ తీగల చుట్టూ చెట్టు కొమ్మ లు, ట్రాన్స్ఫార్మర్స్ చుట్టూ పొదలు పెరిగాయి. కరెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు చిటపట మంటలు పడే అవకాశాలు ఉన్నాయి. ఎవరికైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు..? ఈ పొదలను వెంటనే తొలగించి ప్రమా దం రాక ముందే జాగ్రత్త పడాలి. ఎప్పు డు ఏదైనా ప్రమాదం జరిగితేనే చర్యలు తీసుకుంటున్నారు. ముందే జాగ్రత్తలు తీసుకుం టే బాగుంటుంది. ట్రాన్స్ఫార్మ ర్ చుట్టూ ఉన్న చెట్లు, పొదలు కత్తిరించాలి. గ్రామస్థుల ప్రాణాలతో ఆడుకోవద్దు.

గంగుల రాజ్ కుమార్,

 గ్రామస్తుడు

పిచ్చి మొక్కలను తొలగించండి

మా ఊర్లో ఉన్న ఈ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పొదలు, పిచ్చిమొక్కలు బాగా పెరిగిపోయాయి. వర్షం పడితే చిమ్మ చీకట్లో దారి కనిపించదు. అటు వైపుగా వెళ్లే గృహిణులకు కూడా ప్రమాదకరంగా ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్స్ వద్ద ఉన్న పొదల వల్ల ఎప్పుడైనా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది. మాకు ప్రమాదం జరుగుతుందేమో అని భయంగా ఉంది. ఒక్కసారి చూసి శుభ్రం చేస్తే చాలు మా ప్రాణాలను కాపాడినట్టవుతుంది. ఇలాంటి పొదలు ట్రాన్స్ఫార్మర్స్ చుట్టూ ఎక్కడ ఉన్న తొలగించాలని, ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అందరికి ఉంది.

కన్నెబోయిన వీరేందర్, 

గ్రామస్తుడు