23-10-2025 01:19:06 AM
హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి) : రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధి కారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇందులో 1999 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ (కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ ఎక్సైజ్) అయిన ఎస్‌ఏఎం రిజ్వీ వాలంటరీ రిటైర్డ్‌మెంట్ (31.10.2025) తీసుకున్నారు. దీంతో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా పూర్తి అదనపు బాధ్యతలను కమర్షియల్ ట్యాక్సెస్ కమిషనర్‌గా ఉన్న ఎం.రఘునందన్‌రావుకు అప్పగించారు.
జెన్‌కో సీఎండీగా ఉన్న ఎస్.హరీశ్ దేశాదాయ శాఖ డైరెక్టర్‌గా ఎఫ్‌ఏసీ బాధ్యతలను, ఐటీఈ అండ్ సీ డిప్యూటీ సెక్రెటరీ భవేష్ మిశ్రాకు మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ (లోక్ బాడీస్)గా ఉన్న గరిమ అగర్వాల్‌ను అక్కడి నుంచి బదిలీచేసి, రాజన్న సిరిసిల్ల జిల్లాకు అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
రిజ్వీ వీఆర్‌పై ఆశ్చర్యం
చడీచప్పుడు లేకుండా ఐఏఎస్ సీనియర్ అధికారి అయిన సయ్యద్ అలీ ముర్తు జా రిజ్వీ వాలంరటీ రిటైర్డ్‌మెంట్ తీసుకోవడం.. అటు అధికారులతోపాటు ప్రభుత్వ వర్గాల్లోనూ ఆశ్చర్యానికి గురిచేసింది. గడిచిన రెండు సంవత్సరాల కాలంలోనే దాదా పు మూడుసార్లుబదిలీ అయిన రిజ్వీ(1999 బ్యాచ్‌కు చెందిన) ముక్కుసూటిగా వ్యవహరిస్తారని పేరు ఉంది. అయితే అకస్మాత్తుగా వీఆర్ తీసుకోవడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
అయితే ముక్కుసూ టిగా ఉంటారనే నెపంతో.. అందరిపై ముక్కోపాన్ని ప్రదర్శిస్తారని ఆయన వద్ద పనిచేసిన సిబ్బంది కూడా చెబుతుంటారు. ఇక జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీగా పనిచేసినప్పుడు విద్యుత్‌సౌధలోని అధికారులు, సిబ్బందితో చాలా దురుసుగా వ్యవహరించేవారని, నానా దుర్భాషలాడేవారని సిబ్బంది చాలాసార్లు వాపోయినట్టు సమాచారం. దీనితో ఆయన దగ్గరికి వెళ్లాలంటేనే సిబ్బందిగానీ, అధికారు లు గానీ భయపడేవారని చెప్పుకుంటుంటారు.
ఈ నేపథ్యంలోనే ఆయనపై వచ్చిన ఫిర్యాదులతో.. ప్రభుత్వం అక్కడి నుంచి వేరే స్థానానికి బదిలీ చేసిందని అధికారవర్గాల్లో చర్చ ఉంది. అయితే ప్రభుత్వంలో కీలకమైన కమర్షియల్ ట్యాక్సెస్, అండ్ ఎక్సైజ్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రెటరీగా పనిచేస్తూ.. వాలంటరీ రిటైర్డ్‌మెంట్ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా.. ప్రభుత్వం కూడా బుధవారమే అంగీకరించడం, ఆ వెంటనే ఆయన ప్రస్తు తం నిర్వహిస్తున్న బాధ్యతలను కమర్షియల్ ట్యాక్సెస్ కమిషనర్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ కావడం గమనార్హం. మొత్తానికి రిజ్వీ వీఆర్ తీసుకోవడం ఆయన వ్యక్తిగత నిర్ణయమే అయినా.. దాని వెనక మాత్రం ఏదో చర్చ బలంగా జరిగిందని మాత్రం అధికారవర్గాల్లో కొనసాగుతుంది.