15-12-2025 05:33:49 PM
సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రం, మండల పరిధిలో సోమవారం 15/12/2025 సాయంత్రం 5 గంటల నుండి తేది: 17/12/2025 బుధవారం రాత్రి 12 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, కావున నలుగురు కంటే ఎక్కువ మంది ఒక చోట గుమి గూడటం గానీ, తిరగటం గానీ నిషేదం పోలీంగ్ కు 44 గంటల ముందు నుండే ప్రతీ ఒక్కరు ఎన్నికల నిబంధనలు పాటించాలి. పోస్టర్స్, గుర్తు కండువాలతో ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని, గ్రామంలో ఎవరైనా తాగి న్యూసెన్స్ చేసిన, ఇతరులకు ఇబ్బంది కలిగించిన తాట తీస్తామని, పోలింగ్ రోజు ఎవరైనా తాగి పోలింగ్ బూతులోకి వచ్చిన, న్యూసెన్స్ చేసిన, ఇతరులకు ఇబ్బంది చేస్తే ఎవరైనా ఊరుకునేది లేదు జాగ్రత్తగా ఉండాలని ఎస్ఐ మహేష్ హెచ్చరించారు.