calender_icon.png 15 December, 2025 | 6:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొట్టి శ్రీరాములు ఆశయ సాధన కోసం కృషి..

15-12-2025 04:54:38 PM

ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు ఈగ నాగన్న గుప్తా..

తుంగతుర్తి (విజయక్రాంతి): ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 58 రోజులు నిరాహార దీక్ష చేసి రాష్ట్ర సాధనకు కృషి చేసిన మహానీయుడు పొట్టి శ్రీ రాములేనని తుంగతుర్తి ఆర్యవైశ్య మహాసభ సంఘం అధ్యక్షులు ఈగ నాగన్న అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలు వేసి, వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ఆర్యవైశ్యులు ఐకమత్యంతో సమాజ సేవలో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు తాటికొండ సీతయ్య బండారు దయాకర్ ఓరుగంటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గుండా శ్రీనివాస్ కోశాధికారి మా శెట్టి వెంకన్న బండారు వినయ్, బండారు నాగన్న, కృష్ణమూర్తి, తల్లాడ బిక్షం, తల్లాడ శ్రీను, బుద్ధ వీరన్న, తదితరులు పాల్గొన్నారు.