15-12-2025 05:31:08 PM
రామచంద్రపురం: రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్‌నగర్ కాలనీ బస్‌రూట్‌లోని 14వ బ్లాక్‌లో డ్రైనేజీ పనుల వల్ల రోడ్డు గుంతలమయంగా మారింది. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్, జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు బూరుగడ్డ పుష్పనగేష్ అధికారులతో కలిసి బస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా బస్తీవాసులు నూతన కరెంట్ పోల్ అవసరమని కోరగా, వెంటనే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపించారు. అలాగే సానిటేషన్ సమస్యలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ వారంలోనే సీసీ రోడ్డు, కరెంట్ పోల్ పనులు ప్రారంభించి సమస్యలు పరిష్కరిస్తామని కార్పొరేటర్ హామీ ఇచ్చారు.