పథకాలను ప్రభుత్వం అమలు చేయడం అభినందనీయం
అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
ముషీరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): పేదింటి బిడ్డ పెళ్లికి సహాయపడాలనే ఉద్దేశంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను తీసుకురావడం జరిగిందని అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. ఈ మేరకు గురువారం అంబర్ పెట్ అలికేప్ చౌరస్తాలోని ఎస్‌ఆర్ జీ ఫంక్షన్ హాల్ లో 298 మంది లబ్ధిదారులకి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ వి. హనుమంత రావు తో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంబర్ పెట్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ ఇ. విజయ్ కుమార్ గౌడ్, బాగ్ అంబర్ పెట్ తాజా మాజీ కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి, ఎమ్మార్వో అన్వర్ హుస్సేన్ తో కలిసి లబ్ధిదారులకు షాదీ ముబారక్ 200, కల్యాణ లక్ష్మి 98 చెక్కులను అందజేశారు.
ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ పేదింటి బిడ్డ పెళ్లికి సహాయ పడాలని ఉద్దేశంతో కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకాలు తీసుకురావడం జరిగిందని, ఇప్పటి ప్రభుత్వం ఆ పథకాలను కొనసాగించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, పలు పార్టీల నాయకులు, ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






