03-05-2025 05:43:19 PM
బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ...
మునగాల: దేశవ్యాప్త కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం హర్షనీయమని బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ అన్నారు. మునగాలలో శనివారం మాట్లాడుతూ... దేశ జనాభాలో శాతం పైగా ఉన్న ఓబీసీలను గుర్తించి కుల గణన చేస్తామని ప్రకటించడం ఉద్యమ నాయకుల విజయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గత 40 సంవత్సరాలుగా ఓబీసీల కోసం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో ఉద్యమించి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయారని అన్నారు. ఓబీసీల చిరకాల ఆకాంక్షను నెరవేర్చబోతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్ధత కల్పించాలని అన్నారు.