calender_icon.png 4 May, 2025 | 7:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థికి యాదాద్రి కలెక్టర్ సన్మానం

03-05-2025 05:45:35 PM

యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కంకణాల గూడానికి చెందిన విద్యార్థి భరత్ చంద్ర చారిని కలెక్టర్ హనుమంతరావు(Collector Hanumantha Rao) శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. పదవ తరగతి పరీక్షల ప్రిపరేషన్ సమయంలో విద్యార్థుల తలుపుతట్టే కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ భరత్ చంద్ర ఇంటికి వెళ్లారు. ఈ నేపథ్యంలో అతని కుటుంబ హార్దిక పరిస్థితిని చూసి  చలించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

భవిష్యత్తులో భరత్ చంద్ర చదువుకోడానికి అన్ని రకాలుగా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పరీక్షల అనంతరం తిరిగి మీ ఇంటికి వస్తానని ఇచ్చిన హామీ ప్రకారం. పదవ తరగతి ఫలితాల్లో భరత్ 75% మార్కులు సాధించి ఉత్తీర్ణులయ్యారు. ఇచ్చిన మాట ప్రకారం కలెక్టర్ కంకణాల గూడెం గ్రామానికి విచ్చేసి భరత్ చంద్ర ను అతని తల్లిని శాలువాలతో సన్మానించి అభినందించారు. భవిష్యత్తులో కూడా అండగా ఉంటానని ఏ అవసరం వచ్చినా తన ఇంటి తలుపు తట్టవచ్చని భరోసా ఇచ్చారు.