calender_icon.png 4 May, 2025 | 7:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచాలి

03-05-2025 05:38:10 PM

నిర్మల్ (విజయక్రాంతి): విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో పట్టణంలో భద్రత వారోత్సవాలను విద్యుత్ శాఖ సిబ్బంది ప్రజలకు వివరించాలని జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ బి సుదర్శనం అన్నారు. శనివారం విద్యుత్ భద్రత వారోత్సవాలు సందర్భంగా పోస్టర్లను ఆవిష్కరించి ఈ నెల ఒకటి నుంచి ఏడు వరకు జిల్లాలో చేపట్టే విద్యుత్ భద్రత వారోత్సవాల ప్రాధాన్యతను ఉద్యోగులకు వివరించారు. విద్యుత్ భద్రతపై ప్రజల్లో చైతన్య కలిగించి ప్రమాదాలు జరగకుండా చూడాలని వినియోగదారులకు మెరుగైన సేవలను అందించాలని ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ 1912 పై అవగాహన పెంచాలని విద్యుత్ సేవలను వినియోగదారులకు నాణ్యంగా అందించే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్ డిఇ నాగరాజు విద్య శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.