calender_icon.png 2 September, 2025 | 12:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట...

01-09-2025 08:15:40 PM

ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి

మునుగోడు,(విజయక్రాంతి): పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ… సబ్బండ వర్గాల ప్రజలకు అండగా నిలుస్తోందని ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మునుగోడు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తాసీల్దార్ నేలపట్ల నరేశ్‌ అధ్యక్షతన జరిగిన కార్య‌క్ర‌మంలో 66 మంది ల‌బ్ధిదారుల‌కు చెక్కులు అంద‌జేసి మాట్లాడారు. పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మీ పథకం ఆర్థికంగా ఎంతో తోడ్పాటును అందిస్తుందని తెలిపారు. మహిళల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. గురుకుల పాఠశాలలను ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి తన సొంత నిధుల నుండి అభివృద్ధి చేస్తున్న‌ట్లు తెలిపారు.