19-12-2025 12:20:05 AM
గాంధీ సిద్ధాంతాల ధ్వంసానికి బీజేపీ కుట్ర
బీజేపీ కార్యాలయం మొట్టడికి యత్నం.. అడ్డుకున్న పోలీసులు
నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత
నల్గొండ టౌన్, డిసెంబర్ 18: నేషనల్ హెరాల్ కేసులో గత పదేళ్లుగా అక్రమ కేసులతో సోనియా గాంధీ రాహుల్ గాంధీ లను బీజేపీ కేంద్ర ప్రభుత్వం వేధించిందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న కైలాస నేత అన్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వo గాంధీ కుటుంబం పై హెరాల్ అక్రమ కేసులను వ్యతిరేకిస్తూ గురువారం బీజేపీ కార్యాలయం ముట్టడికి ఆయనతోపాటు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
ప్రతిగా బిజెపి కార్యకర్తలు కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు బిజెపి కార్యాలయం వైపు కాంగ్రెస్ నాయకులు కోడిగుడ్లు విసిరారుదీనితో కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి నల్గొండ టూ టోన్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత మాట్లాడుతూ కేంద్రం లో ని బీజేపీ ప్రభుత్వం గాంధీ కుటుంబ గౌరవం తగ్గించడం కోసం నేషనల్ హెరాల్ పేరు తో అక్రమ కేసులు పెట్టి గత పది సంవత్సరాలు గా వేదించె ప్రయత్నం చేసింది.
మోడీ ప్రభుత్వం పరిపాలించడం చేత కాక ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఇడి సిబిఐ వంటి సంస్థల ని ఉపయోగించి ప్రతిపక్షాలని అణచి వేయాలని చూస్తోందని మండిపడ్డారు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని గాంధేయ సిద్ధాంతాలను ధ్వంసం చేయడానికి బిజెపి మోడి కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని బీజేపీ రాజ్యాంగ సంస్థలైన సిబిఐ ఈడి ఐటి లాంటి సంస్థలను ఉపయోగించి సోనియా గాంధీ రాహుల్ గాంధీ లను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.
నేషనల్ హెరాల్ కేస్ పై ఢిల్లీ హైకోర్టులో సోనియా రాహుల్ పై క్లీన్ షీట్ లభించిందని ఈ కేసు వెనక బిజెపి హస్తముందని ఇది గాంధీ కుటుంబాన్ని వేధించడానికి కుట్ర అన్నారు. దేశ సంపదను అంబానీ ఆదానిలకు దారా దత్తం చేస్తున్న మోడీ కుట్రలను ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీ పై కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్న బిజెపి ఆటలు సాగమన్నారు. గాడ్సే సిద్ధాంతాలను అనుసరిస్తున్న బిజెపికి కాలం చెల్లిందని గాంధీ సిద్ధాంతాలను అనుసరిస్తున్న రాహుల్ గాంధీ 2029 లో ప్రధాని అవుతాడని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ బోడ స్వామి,మాజీ ఎంపీపీ చామల శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి మరల చంద్రారెడ్డి, కాషిరెడ్డి నరేష్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు అంబటి సోమన్న, చిరూమర్రి కృష్ణయ్య, కన్నారావు, పోకల దేవదాసు, గాజుల శ్రీనివాస్ చిలుకూరి బాలు, ముంతాజ్ అలీ, ఎండీ ఆరిఫ్ మల్లేష్ గౌడ్ రాజేందర్ రెడ్డి బట్టు జగన్ యాదవ్, పారిజాత సుజాత, ఏసు పాదం లక్ష్మీనారాయణ,
సుధాకర్ ముదిరాజ్ ముచ్చపోతుల శ్రీనివాసులు బొల్లం ఎంకన్న, ఆరెళ్ళ సైదులు,,నాయకులు, వివిధ మండల పార్టీ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్లు,యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ, ఐ ఎన్ టి యు సి, సేవాదళ్,మహిళా కాంగ్రెస్, ఎస్ టి సెల్, ఎస్ సి సెల్, మైనార్టీ, సేవాదళ్ సర్పంచులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనారు.