calender_icon.png 19 May, 2025 | 12:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి

19-05-2025 01:30:22 AM

  1. బెట్టేతండా, జాన్ పహాడ్ ఎత్తిపోతలతో పాలకీడు సస్యశ్యామలం
  2. వేగంగా పనులు పూర్తి చేయాలి
  3. నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాలు

హుజూర్‌నగర్, మే 18: రైతుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం పాలకీడు మండలం బెట్టేతండాలో మూసీనదిపై నిర్మిస్తున్న బెట్టేతండా, జాన్ పహాడ్ గ్రామంలో కృష్ణ నదిపై నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాల పనులను ఎమ్మె ల్సీ శంకర్‌నాయక్‌తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బెట్టేతండా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రూ.33.83 కోట్లతో నిర్మిస్తున్నామని దీని కింద బెట్టేతండా, పాడేతండా, రాఘవపురం, సజ్జాపురంలోని బడుగు బలహీన వర్గాల రైతులు 2,176  మందికి చెందిన 2,041 ఎకరాలకి సాగునీరు అందిస్తామని తెలిపారు. ఇప్పటికే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కోసం భూసేకరణ పూర్తి అయిందని, రైతులకు నష్టపరి హారం కూడా చెల్లించామని చెప్పారు.

ఆగస్టు నాటి కి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశిం చారు. జాన్‌పాడు లిప్ట్ ఇరిగేషన్ పనులు నెమ్మదిగా కొనసాగుతుండటంపై అగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధ ప్రతిపాదికన జాన్‌పాడ్ లిప్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే మూడుసార్లు సందర్శించినా పను ల్లో పురోగతి లేదని కాంట్రాక్టర్‌పై ఆగ్ర హం వ్యక్తం చేశారు.

జాన్‌పాడు లిప్ట్ ఇరిగేషన్ స్కీంను రూ.273 కోట్లతో నిర్మిస్తున్నామని, దీని ద్వారా జాన్‌పాడు, గుండెబోయిన గూడెం, గుండ్లపాడు, అలింగాపురం, బొత్తలపాలెం, కోమటికుంట, మీగ డం పాడు తండా, చెరువుతండా, పాలకీడు, సజ్జాపురం, నాగిరెడ్డిగూడెం గ్రామాల్లోని 10,000 ఎకరాలకి సాగునీరు అందిస్తామని తెలిపారు. జాన్‌పహాడ్, బెట్టే తండా లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పూర్తి అయితే పాలకీడు మండలం సస్యశ్యామలం అవుతుందన్నారు.

ఈ ప్రాజె క్ట్ కోసం అదనంగా కావాల్సిన 12 ఎకరాలు భూ సేకరణ పనులు త్వరగా పూర్తి చేసి రైతులకి నష్ట పరిహారం అందించాలని ఆర్డీవోకు సూచించారు. నవంబర్ నాటికి పనులు పూ ర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.

ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ మాట్లాడుతూ.. కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల భవిష్యత్ తరాలకి ఫలాలు అందేలా మంత్రి ఉత్తమ్ అభివృద్ధి చేశారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీని వాసులు, ఇరిగేషన్ సీఈ రమేష్‌బాబు, ఎస్ ఈ శివధర్మతేజ, డీఈ నవికాంత్, ఏఈ సతీష్ పాల్గొన్నారు.