calender_icon.png 16 October, 2025 | 7:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హర్షిత్ రాణాను టార్గెట్ చేయడం సిగ్గుచేటు

15-10-2025 12:00:00 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: భారత యువ పేస ర్ హర్షిత్ రాణాను ఉద్దేశిస్తూ వస్తోన్న ట్రోలింగ్‌పై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్ అయ్యాడు. 23 ఏళ్ళ యువ క్రికెటర్‌ను టార్గె ట్ చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించాడు. కావాలంటే తనను టార్గెట్ చేయమని, హర్షి త్ రాణాను ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటూ మండిపడ్డాడు. ఇటీవల ఆసీస్ టూర్ కోసం ప్రకటించిన టీ20, వన్డే జట్లలో హర్షిత్ చోటు దక్కించుకున్నాడు.

అయితే కోల్‌కత్తా నైట్ రైడర్స్‌కు గంభీర్ మెంటార్‌గా పనిచేసినప్పుడు ఈ యువ పేసర్ వెలుగులోకి వచ్చా డు. దీంతో గంభీర్ శిష్యుడు కావడంతోనే అతన్ని జట్టులోకి తీసుకుంటున్నారంటూ మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్, పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. తాజాగా ఈ విమర్శలపై స్పందించిన గంభీర్ వ్యూస్ కోసం 23 ఏళ్ళ యువకుడిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం దారుణమని మండిపడ్డాడు. ఆటగాళ్ళ ప్రదర్శనను చూసుకోవడానికి సెలక్టర్లు ఉన్నారం టూ చురకలంటించాడు.