calender_icon.png 16 October, 2025 | 11:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధోనీని ఫాలో అయిన గిల్

15-10-2025 12:00:00 AM

వెస్టిండీస్‌పై రెండో టెస్టులో విజయంతో తొలిసారి కెప్టెన్‌గా సిరీస్ విజయాన్ని అందుకున్న యువ కెప్టెన్ శుభమన్‌గిల్ ట్రోఫీ తీసుకున్న తర్వాత చేసిన పని వైరల్‌గా మారింది. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా నుంచి చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్న గిల్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తరహాలోనే జట్టులోకి కొత్తగా వచ్చిన నారాయణ్ జగదీశన్ చేతికి దానిని ఇచ్చాడు. ఆ సమయంలో జడేజా అతడి చేతిలో నుంచి ట్రోఫీని లాక్కుని సరదగా ఆట పట్టించాడు. మళ్ళీ తిరిగి జగదీశన్‌కే ఇచ్చిన జడేజా, గిల్, ఇతర టీమ్ మెంబర్స్‌తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.