13-08-2025 12:50:19 AM
బెజ్జంకి ఆగస్టు 12: దేశ సమగ్రతను కాపాడడం మనందరి కర్తవ్యం అని బిజెపి నాయకులు అన్నారు. దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా మండల బిజెపి నాయకులు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. మంగళవారం మండల కేంద్రంలోని మాత్మ గాంధీ ,అంబేద్కర్ , విగ్రహాలను నీటితో శుభ్రపరిచి పూలమాలవేసి నివాళులర్పించారు.
మండల పరిధిలోని రామ్ సాగర్ గ్రామానికి చెందిన మాజీ సైనికులు, రైతులకు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి, మండల అధ్యక్షులు కొలిపాక రాజు లు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత ప్రభుత్వం ప్రారంభించిన హర్ ఘర్ తిరంగా భారతీయుల్లో దేశభక్తిని జాతీయ భవాని ఎంతో గాను పెంపొందించడానికి దోహదం చేస్తుందని అన్నారు.
దేశ సమగ్రతను కాపాడడం మనందరి కర్తవ్యమని.ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను తమ ఇంటిపై ఎగరవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు బుర్ర మల్లేశం, సీనియర్ నాయకులు దొమ్మట రాములు, కొత్తపేట రామచంద్రం, సంగ రవి, సాన వేణు బుర్ర కిషన్, వడ్లూరి శ్రీనివాస్, ఒగ్గు కనకయ్య , శ్రీనివాస్,రావుల రాజిరెడ్డి, నేతి మహేష్, పోతుల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.