calender_icon.png 13 August, 2025 | 6:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిన్నారంలో తిరంగా ర్యాలీ

13-08-2025 12:51:23 AM

పటాన్ చెరు(జిన్నారం), ఆగస్టు 12 : స్వాతంత్ర సమరయోధులను స్మరిస్తూ ఆపరేషన్ సింధూర్ లో మృతి చెందిన భారత సైనికులకు నివాళులు అర్పిస్తూ మండల కేంద్రం జిన్నారంలో మంగళవారం బీజేపీ నాయకులు తిరంగా ర్యాలీ నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు జగన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఉపాధ్యక్షుడు వంగేటి ప్రతాప్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జిన్నారం ప్రధాన రహదారిపై జాతీయ జెండాలతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబర్ సుధాకర్, మండల ప్రధాన కార్యదర్శి ఎం మాణిక్యం, సీనియర్ నాయకులు నల్లగండ్ల అశోక్ కుమార్, మద్దూరి రాజు, కుమ్మరి కృష్ణ, సీహెచ్ లక్ష్మణ్, దుబ్బ శ్రీనివాస్, బాలయ్య, కొరివి దేవేందర్, వెంకటేష్, లక్ష్మణ్, అశోక్ తదితలు పాల్గొన్నారు.