calender_icon.png 20 November, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత

20-11-2025 12:12:16 AM

  1. జీవన శైలిలో భాగంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
  2. ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి) : ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడటం ప్రభుత్వం బాధ్యత అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలో హెల్త్ క్యాంప్‌ను ప్రారంభించారు. సెక్రటేరియట్ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ కోసం రేనోవా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత మెగా కార్డియాక్ హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశారు. 

సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్వంలో వచ్చిన ఉద్యోగులకు రేనోవా హాస్పిటల్ వైద్య సిబ్బంది అ త్యాధునిక ఎక్విప్ మెంట్ సాయంతో బీపీ, జీఆర్‌బీఎస్, ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలను నిర్వహించారు.

కార్డియాలజీ, జనరల్ ఫీజిషన్ సేవలను ఉచిత కన్సల్టేషన్ సేవలను అందించారు. మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ  ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని కాపా డుకోవాలన్నారు. రేనోవా ఆస్పత్రి వైద్య సిబ్బందిని మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో వైద్యులు, నితిజ్ఞ హర్కర, సిబ్బంది పాల్గొన్నారు.