20-11-2025 12:10:32 AM
-బైంసాలో స్థిరాస్తి బదిలీ వెలుగులోకి వచ్చిన కేసు
-నలుగురు నిందితుల రిమాండ్
-మున్సిపల్, సబ్ రిజిస్టర్ అధికారుల లీలలు.. ఇంతింత కాదయ్యా..
బైంసా, నవంబర్ 19 (విజయక్రాంతి): ప్రభుత్వ శాఖలు ఏవైనా పై తెలిస్తేనే పని జరుగుతుంది. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి అవినీతి అక్రమలకు అడ్డగా మారు తుందని పైసా మున్సిపల్ ప్రజలు ఆరోపిస్తున్న నేపథ్యంలో సిరాస్తి బదిలీ మోసం. వెలుగులోకి వచ్చి నలుగురు ఉద్యోగులు కటకటాల పాలైన వైనం జిల్లాలో తీవ్ర చర్చకు దారితీసింది..
భైంసాలో నకిలీ పత్రాలను సృష్టించి ఓస్థిరాస్తిని ఇతర వ్యక్తిపై అక్రమంగా మోటేషన్ రిజిస్ట్రేషన్ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తనకు తెలియకుండా బ్రాహ్మణ గల్లీలోని తన ఇంటి స్థలాన్ని మరొకరిపై యాజమాన్యం మార్పిడి చేసినట్టు తెలుసుకున్న ఓ వ్యక్తి పట్టణ పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు పట్టణ సీఐ గోపీనాథ్ తెలిపారు.
బైంసాకు చెందిన చట్లావార్ శైలేష్, గోగుర్ రాజు, రఫీయుద్దీన్ ఇంతియా జ్ ఓ ఇంటి స్థలాన్నిగుర్తించి, దాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ చేశా రు. దీనికోసం, అసలు యజమాని పేరిట ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోడానికి అదే పేరు కలిగిన మరో వ్యక్తిని నకిలీ యజమానిగా ఎంచుకున్నారు.గోగుర్ రాజు తన మిత్రుడు చట్లావార్ శైలేశ్‌కు డబ్బు ఆశ చూపించి, ఈ కుట్రలోకి తీసుకొచ్చాడు. డాక్యుమెంట్ రైటర్ రఫీ తన నైపుణ్యాన్ని ఉపయోగించి, శైలేష్ పేరు మీద నకిలీ నోట రీ అఫిడవిట్‌ను తయారు చేసి, మ్యుటేషన్ కోసం మున్సిపాలిటీలో సమర్పించాడు. ఇక్కడే అంతర్గత అవినీతి బయటపడింది.
ఇంతియాజ్, మున్సిపాలిటీ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, మనీష్ అనే కాంట్రాక్ట్ కంప్యూటర్ ఆపరేటర్‌తో సన్నిహితంగా సమన్వ యం చేసుకున్నాడు. మనీష్ కాంట్రాక్ట్ రెండున్నర సంవత్సరాల క్రితమే ముగిసినప్పటికీ, అతను పని కొనసాగిస్తూనే, మున్సి పల్ కమిషనర్ యొక్క డాంగిల్ను వాడేవాడు. అంతేకాకుండా, ఇంతియాజ్‌తో కలిసి పనిచేస్తున్న మున్సిపల్ కమిషనర్ అతని ఆదేశాల మేరకు ఓటీపీ ఇచ్చేవారు. వాట్సప్ చాట్లు ఈ విషయాన్ని గుర్తించారు. ప్రతి పనికి మనీష్, ఇంతియాజ్ ఆమోదం కోరేవాడు, ఆ తర్వాతే మున్సిపల్ కమిషనర్ ఆన్లైన్ మ్యుటేషన్ కోసం ఓటీపీలను అందించేవారు. మనీష్ మామూళ్ల విషయం ఇంతియాజ్‌కు సమాచారం ఇచ్చేవాడు. తరువాత అధికారులు సిబ్బంది వాటాలు గా పంచుకునేవారు.
ఆగస్టు 2వ తేదీన, ఇంతియాజ్ ఆదేశాలపై, ఎటువంటి విచారణ, నోట్ ఫైల్ లేకుం డా, కేవలం ఓటీపీ ఆమోదం ఆధారంగా 2-3 గంటలలోపే మ్యుటేషన్ పూర్తి చేశారు. ఆగస్టు 5వ తేదీన, మున్సిపల్ కమిషనర్ సంతకం లేకపోయినా యాజమాన్య ధృవీకరణ పత్రాన్ని జారీ చేసి, నిందితులకు అం దించారు. అదే రోజు, మోసపూరిత అమ్మక పు ఒప్పందం అమలు చేశారు. కమిషనర్ సంతకం లేని సర్టిఫికెట్‌ను ఎస్‌ఆర్‌వో ఎలా ఆమోదిస్తారని నకిలీ యజమాని ప్రశ్నించగా, రఫీయుద్దీన్ తన సహచరుడు షేక్ జానీ ద్వారా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి మామూలు చెల్లించి ఆ విషయం ‘మ్యానేజ్’ చేశారు. మరుసటి రోజు భైంసా సబ్ రిజిస్టర్ సంతకాలు ధృవీకరించకుండానే ఒప్పందా న్ని ఆమోదించారు.
ఈ మోసపూరిత ఒప్పందాన్ని ఉపయోగించి, నిందితులు ఆ ఆస్తిని తాకట్టు పెట్టి రోహిత్ అనే వ్యక్తి నుంచి రూ.10,00,000 నగదు సేకరించారు. అసలు యజమాని అక్టోబర్ 29న మోసాన్ని తెలుసుకుని ఫిర్యాదు చేయడంతో, ప్రాథమిక విచారణ ప్రారంభమైంది. చట్టపరమైన సమస్యలను పసిగట్టిన నిందితులు, మోసపూరిత దస్తావేజును రద్దు చేయడానికి ప్రయత్నించారు. అంతర్గత డబ్బు వివాదాల తర్వాత, రఫీయుద్దీన్ పిప్రి వద్ద గల తన సొంత భూమిని రోహిత్‌కు అమ్మి, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించి, అసలు పత్రాన్ని తిరిగి తీసుకున్నాడు. చివరకు నవంబర్ 10 న రద్దు దస్తావేజు అమలు చేశారు.
ఇదిలా ఉండగా, మున్సిపాలిటీ మరియు ఎస్‌ఆర్‌వోలకు నోటీసులు జారీ చేసిన తరువాత, ఆగస్టు 2న జరిగిన అక్రమ మ్యుటే షన్ను కప్పిపుచ్చడానికి నవంబర్ 14న వెనుకటి తేదీతో ఒక నోట్ ఫైల్‌ను సృష్టించడాని కి ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంలో ప్రైవేట్ వ్యక్తులు, మున్సిపల్, సబ్ రిజిస్టర్ కార్యాలయం అధికారులు, సిబ్బంది, వ్యవస్థీకృత మోసాల నెట్వర్క్ వెల్లడైంది. ఆధారా లలో వాట్సాప్ చాట్లు, నకిలీ పత్రాలు, కాల్ లాగ్లు, ఆర్థిక లావాదేవీల వివరాలు, సాక్షుల వాంగ్మూలాలు బయటపడ్డాయి. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాం డ్ పంపగా మరికొందరి ని అరెస్టు చేయాల్సి ఉందని సిఐ వెల్లడించారు.