calender_icon.png 28 November, 2025 | 2:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లాక్‌డౌన్ తర్వాత పరిస్థితే కథ

28-11-2025 12:42:46 AM

అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ సర్వైవల్ థ్రిల్లర్ ‘లాక్‌డౌన్’. ఏఆర్ జీవా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను లైకా ప్రోడక్షన్ నిర్మిస్తోంది. అనుపమ పరమేశ్వరన్ ఇందులో ‘అనిత’ అనే పాత్రను పోషిస్తోంది. ఇంకా ఇందులో చార్లీ, నిర్మల, ప్రియావెంకట్, ఇందుమంతి, రాజ్‌కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫ్పీ ప్రశంసలు అందుకున్న ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ గురువారం ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్ చూస్తుంటే కరోనా మహమ్మారి వల్ల ఇండియాలో లాక్‌డౌన్ విధించిన అనంతరం జరిగిన పరిస్థితుల నేపథ్యంలో రూపొందిన కథ అని అర్థమవుతోంది.