calender_icon.png 23 November, 2025 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జడేజా అదుర్స్

24-01-2025 01:12:41 AM

ముంబై: రంజీ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సౌరాష్ట్ర తరఫున అదరగొట్టాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో బౌలింగ్‌లో మెరిసిన జడేజా ఐదు వికెట్లు పడగొట్టాడు.దీంతో ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులకు కుప్పకూలింది. ప్రస్తుతం సౌరాష్ట్ర 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఇక భారత కెప్టెన్ రోహిత్ నిరాశపరిచాడు.

జమ్మూ కశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగిన రోహిత్ 3 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. అతడితో పాటు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) కూడా విఫలమయ్యాడు. ఫలితంగా ముంబై 120 పరుగులకే కుప్పకూలింది. అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో జమ్మూ కశ్మీర్ 174 పరుగులకు ఆలౌటైంది.

శుబ్‌మన్ కజురియా (53) రాణించాడు. ప్రస్తుతం ముంబై 54 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. బెంగాల్‌తో మ్యాచ్‌లో హర్యానా 157 పరుగులకు ఆలౌట్ కాగా.. కేరళతో మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ 160 పరుగులకు ఆలౌటైంది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి కేరళ వికెట్ నష్టపోకుండా 54 పరుగులు చేసింది.