calender_icon.png 15 September, 2025 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ నాయకుల బ్లాక్ మార్కెట్‌తోనే యూరియా కొరత

15-09-2025 12:32:18 AM

పెద్దపల్లిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురేష్ రెడ్డి

పెద్దపల్లి సెప్టెంబర్ 14 విజయ క్రాంతి) కేంద్ర ప్రభుత్వం యూరియా రాష్ట్ర ప్రభుత్వానికి సరిపడా అందించిన కాంగ్రెస్ నాయకులే యూరియాను పక్క తోవ పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురేష్ రెడ్డి ఆరోపించారు.పెద్దపల్లి జిల్లా కేంద్రం లో నిర్వహించిన మీడియా సమావేశంలో గొట్టే ముక్కల సూరేష్ రెడ్డి  మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎంత చెబితే అన్ని మెట్రేక్ టన్నుల యూరియా తెలంగాణ కు ఇచ్చిందని, కాని దాన్ని  కాంగ్రెస్ నాయకులే బ్లాక్ చేసి అమ్ముకుంటున్నారనీ అన్నారు.

పెద్దపల్లి  నియోజకవర్గం వ్యవసాయ రంగంలో ముందడుగులో ఉండగా, రైతులను ఇబ్బంది పెట్టిన ఘనత స్థానిక ఎమ్మెల్యేదే అని పేర్కొన్నారు.పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణ రావు  ముఖ్యమంత్రి తన సన్నిహితుడే అని చెప్పకనే ఎన్నోసార్లు చెప్పారని, మరి యూరియాను ముఖ్యమంత్రిగా చెప్పి తెప్పించేందుకు ఎందుకు ముందుకు రావడంలేదని ప్రశ్నించారు. పెద్దపల్లి రైతులను గాలికి వదిలేయొద్దని, పెద్దపల్లి ఎమ్మెల్యే ను సురేష్ రెడ్డి నిలదీసారు.

రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 6.12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా పంపించిందని,రాష్ట్రం వద్ద 1.76 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉంచిందని,ఇంకా 19.600 మెట్రిక్ టన్నుల యూరియా పంపించడానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ సమావేశంలో బిజెపి సుల్తానాబాద్ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్, జిఎస్‌ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు కనుకుంట్ల జోగేందర్, బొడ్డుపల్లి కుమార్ తదితరులుపాల్గొన్నారు.