14-08-2025 04:53:56 PM
కుభీర్: నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని కానోబా గల్లీలో గల ప్రసిద్ధిగాంచిన పురాతన శ్రీకృష్ణ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి(Krishna Janmashtami) వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో పూజారులు అభిషేకం, పుష్పార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో వార్కరి సంప్రదాయ బద్ధులైన శ్రీ విట్టల్ మహారాజ్ కీర్తన, భజన కార్యక్రమాలను కొనసాగించారు. మూడు రోజుల పాటు ఘనంగా జరిగే ఈ వేడుకలకు కుబీర్ తో పాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకుని ముక్కులు తీర్చుకుంటారు. అష్టమి రోజైన శనివారం ఉదయం స్వామివారికి అభిషేకం, పట్టు వస్త్రాల సమర్పణ, ఊయల కార్యక్రమంతో పాటు భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ జరగనుంది. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారు. ఆలయ కమిటీ అధ్యక్షులు తిప్పబోజన్న, సభ్యులు పుప్పాల పిరాజి, భజన మండలి సభ్యులు గిరి పోశెట్టి, ఆలయ కమిటీ సభ్యులు వేడుకలకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు.