14-08-2025 04:51:55 PM
కుభీర్: నిర్మల్ జిల్లా(Nirmal District) కుభీర్ మండల కేంద్రంలో "అఖండ భారత్" కార్యక్రమంలో భాగంగా హిందూ వాహిని కుభీర్ శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక అన్న బహుసాటే కూడలిలో బిజెపి నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పడిపెల్లి గంగాధర్ ముఖ్యఅతిథిగా పాల్గొని కాషాయ జెండాను ఎగరవేసి మాట్లాడారు. ఎందరో మహనీయుల త్యాగఫలం స్వతంత్ర భారతావనిగా రూపుదిద్దుకొందని అన్నారు. నేడు ఆ మహనీయులను స్మరించుకొని వారి అడుగు జాడల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అఖండ భారత్ గా మన దేశం నిలిచేందుకుగాను ప్రతి యువకుడు సంకల్పించుకొని ముందుకు సాగాలన్నారు. ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన భరత దేశం అఖండ భారత్ గా నిలిపేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని ఆ కల సాకారం దిశగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని పేర్కొన్నారు. హిందు వాహిని మండల శాఖ అధ్యక్షుడు నాగభూషణ్, బిజెపి మండల అధ్యక్షుడు ఏశాల దత్తు, దొంతుల దత్తాత్రి, బోయిడి అభిషేక్, హిందు వాహిని కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.