calender_icon.png 14 September, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవో నంబర్ 99ని రద్దు చేయాలి

14-09-2025 01:16:57 AM

రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ బేర బాలకిషన్ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతి

ముషీరాబాద్, సెప్టెంబర్ 13(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో నంబర్ 99 తో ఎస్సీలలోని 58 కులాలకు పూర్తిగా అన్యాయం జరుగుతుందని, దీన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ మం దాల భాస్కర్,  గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ బేర బాలకిషన్ (బాలన్న) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ మేరకు శనివారం తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ పై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉప సంఘం సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ, బిసి వెల్ఫేర్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి మాలలకు జరుగుతున్న అన్యాయంపై వినతి పత్రం అందజేసినట్లు వారు వెల్లడించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను అస్సలు పాటించకుండా ఎస్సీల కోసం అధ్యయనం చేయ డానికి వేసిన జస్టిస్ షమీం అక్తర్ రిపోర్టును అసెంబ్లీలో అందరు సభ్యులకు ఇవ్వకుండా,   ఉద్యోగాలలో ప్రమోషన్ రాకుండా విద్యార్థులలో ఉన్నత చదువుల కోసం అడ్మిషన్లు రాకుండా ఈడబ్ల్యూఎస్ వర్గాల కంటే కూడా రోస్టర్ విధానంలో ఎస్సీలలోని 58 కులాలకు పూర్తిగా అన్యాయం చేశారని వారు మండిపడ్డారు.

ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వర్గీకరణలో మాలలకు అన్యా యం జరిగిన విషయం తెలిసిందేనని, ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృ ్టకి తీసుకెళ్లి సమస్య పరిష్కారమయ్యేటట్లు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు వారు వెల్లడించారు. మంత్రిని కలిసిన వారిలో మాల సం ఘాల జేఏసీ గౌరవాధ్యక్షుడు చెరుకు రామచందర్,  మాల విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు మాదాసు రాహుల్ రావు, జేఏసీ నాయకులు నాలుకల నర్సింగ్ రావు,  పండుగ భాను తేజ,  నామ సైదులు, డాక్టర్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.