11-08-2025 09:55:25 PM
ఎమ్మెల్యే పద్మావతి..
కోదాడ: నియోజకవర్గ శాసనసభ్యురాలు నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి(MLA Uttam Padmavathi Reddy) కోదాడ పీఎం శ్రీ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలను సోమవారం ఆకస్మికంగా సందర్శించడం జరిగింది. వారితో పాటు మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు పాల్గొన్నారు. పాఠశాల ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు డి. మార్కండేయ ఉపాధ్యాయులు బృందం పాఠశాలలో ఉన్న ఇబ్బందులు సమస్యలను గురించి పరిష్కారం కోసం వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
12 తరగతి గదులు పూర్తి నిర్మాణం జరగకపోవడం, వంటగది హ్యాండ్ వాష్ ఏరియా నిర్మాణం పూర్తి కాకపోవడం, బాలురు బాలికలకు సరిపడా మరుగుదొడ్లు నిర్మాణం కాకపోవడం, వర్షాలకు పాఠశాలలో ఉన్న ఆడిటోరియం వర్షపునీరుతో నిండిపోవడం, పాఠశాల ఆట స్థలం యందు నీరు నిలవడం, నీటిని రహదారి మురుగు కాలవలో కలపడానికి ఏర్పాట్లు చేయవలసిందిగా, పాఠశాలలో సభలు సమావేశాలు నిర్వహించుకోవడానికి కళావేదిక నిర్మాణం చేయవలసిందిగా కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సమస్యలను సానుకూలంగా పరిశీలించి పరిష్కరిస్తానని తెలియజేయడం జరిగింది. అనంతరం శాసనసభ్యురాలని పాఠశాల ఉపాధ్యాయలు పూలమాల, శాలువాతో సన్మానించడం జరిగింది.