calender_icon.png 12 August, 2025 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎర్రగుంట చెరువు ధ్వంసం

11-08-2025 10:07:16 PM

కన్నాల గ్రామంలోని పంట పొలాలు జలమయం..

మత్స్యకార సొసైటీ కి తీరని నష్టం..

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామపంచాయతీ పరిధిలోగల ఎర్రగుంట చెరువును కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. చెరువులో నీరు నిల్వ లేకుండా కాలువ తీయడంతో తమకు తీరని నష్టం వాటిల్లిందని మత్స్యకార సొసైటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి చెరువులోని నీరు కాలువ ద్వారా కన్నాల గ్రామ పరిసరాల్లోని మళ్లడంతో పొలాలు జలమయమయ్యాయి. ఈ చెరువులో లక్ష రూపాయల విలువ చేసే చేప పిల్లలను వేసినట్లు మత్స్యకార సొసైటీ సభ్యులు చెబుతున్నారు.

చెరువును పూర్తిగా ధ్వంసం చేయడంతో చుక్కనీరు నిలవని పరిస్థితి తలెత్తిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు పూర్తిగా ధ్వంసమై నీరు నిలవకుండా వృధాగా పోవడంతో పక్కనే ఉన్న 450 ఎకరాలు ముంపుకు గురవుతున్నట్లు కన్నాల గ్రామానికి చెందిన జి .వెంకటస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. తమ సొసైటీకి రూ లక్ష వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ , ఇరిగేషన్ అధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన మత్స్యకారుల కుటుంబాలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకున్నారు.