calender_icon.png 12 August, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూలీ డబ్బులు అడిగినందుకే రాజబాబును హత్య చేసిన హంతకుడు

11-08-2025 10:10:14 PM

కత్తితో పొడిచి పారిపోయిన హంతకుడు

మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) కన్నాయిగూడెం మండలంలోని సర్వాయి గ్రామంలో మడే రాజబాబు చేసిన కష్టానికి కూలి డబ్బులు అడిగినందుకు కత్తితో పొడిచి ప్రాణాలు తీసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన మడే రాజబాబు(40) కూలి పనులు చేసుకుంటూ భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఈ నెల 9వ తేదీన బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన కుమ్మరి బాబు కాంట్రాక్టు తీసుకొని నిర్మిస్తున్న ఇంటి నిర్మాణ పనులకు రాజబాబును కూలికి రమ్మని పిలిచాడు. ఉదయం వెళ్లకుండా రాజబాబు ఇంటి వద్ద పని ఉండటంతో మధ్యాహ్నం 1 గంటకు కూలికి వెళ్లి సాయంత్రం వరకు పనిచేశాడు. కూలి డబ్బులు ఇవ్వమని బాబును రాజబాబు అడిగాడు. కూలి డబ్బులు ఇవ్వకుండా బాబు గొడవ పడి చేయిచేసుకున్నాడు.

సాయంత్రం ఇంటికి వచ్చి విషయాన్ని తన భార్యకు రాజబాబు చెబుతుండగా ఇంటి పక్కనే ఉన్న కుమ్మరి బాబు బావ మరిది అయిన కోరం రంజిత్ విషయాన్ని విని ఉదయం మాట్లాడుకుందాం అందరి ముందు మా బావను డబ్బులు ఎందుకు అడిగావని రాజబాబుతో గొడవపడి రాజబాబుని కొట్టాడు. జరుగుతున్న గొడవను చూసిన రాజబాబు భార్య రేపు మనం మాట్లాడుకుందాం అనడంతో రంజిత్ తన ఇంటికి వెళ్లాడు. కోరం రంజిత్ తిరిగి రాత్రి 10:15గం టలకు రాజబాబు ఇంటికి వచ్చి అతని భార్యను నెట్టివేసి తన వెంట తెచ్చుకున్న కత్తితో రాజబా బును ఎడమ పక్కన పొట్టపై కత్తితో పొడిచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ రాజబాబును అతని భార్యతోపాటు గ్రామానికి చెందిన మరికొందరు మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లగా ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం ఏటూరునాగారం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్యులు పరీక్షించి రాజాబాబు మృతి చెందినట్లు నిర్ధారించారు. రాజబాబు భార్య మడే బేబి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.