calender_icon.png 12 August, 2025 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

11-08-2025 10:05:16 PM

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ..

కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి..

కోదాడ: నిరుపేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి(MLA Padmavathi Reddy) అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురికి ముఖ్యమంత్రి సహయనిధి ద్వారా మంజురైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పంపిణీ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా కోటి 11 లక్షల 76 వేల రూపాయలు 312 చెక్కులు బాధితులకు పంపిణీ చేసినట్లుగా తెలిపారు. జిల్లా గ్రంథాలయం చైర్మన్ వంగవేటి రామారావు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎర్నేని బాబు, మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు వరప్రసాద్ రెడ్డి, సంతోష్ రెడ్డి, తుమాటి నాగిరెడ్డి ఇర్ల లక్ష్మారెడ్డి సుమన్ రెడ్డి,  నారపరెడ్డి, బాల్ రెడ్డి నాగ ప్రసాద్ బండి కోటయ్య పాల్గొన్నారు.