calender_icon.png 17 January, 2026 | 9:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

17-01-2026 01:03:56 AM

ఎమ్మెల్యే గంగుల కమలాకర్

కరీంనగర్, జనవరి 16 (విజయ క్రాంతి): తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన కరీంనగర్ అభివృద్ధిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై అడ్డుకున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నగరంలోని 64వ డివిజన్ లో సాధారణ నిధుల నుండి 20 లక్షల రూపాయల వెచ్చించి చేపట్టిన సీసీ రోడ్డు పనులకు ఆయన కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో 350 కోట్ల సీఎం అష్యూరెన్స్ నిధులు, 125 కోట్ల అర్&బి నిధులతో మట్టి రోడ్లు లేని నగరంగా కరీంనగర్ లో సీసీ రోడ్లు నిర్మించామని... కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అడ్డుకుందని అన్నారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ... కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధికి ఒక్క పైసా నిధులు తేవడం లేదని మండి పడ్డారు. తమ హయాంలో చేపట్టిన అభివృద్ధి తప్ప కొత్తగా ఎ లాంటి అభివృద్ధి జరగడం లేదన్నారు. తమ హయాంలో చేపట్టిన అభివృద్ధిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు వాల రమణారావు, గందె మహేష్, ఐలేందర్ యాదవ్, నాంపల్లి శ్రీనివాస్, నక్క కృష్ణ, బోనాల శ్రీకాంత్, మాజీ సుడా డైరెక్టర్ నేతి రవి వర్మ, పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ డివిజన్ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.