01-12-2025 07:21:25 PM
నకిరేకల్ (విజయక్రాంతి): మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య 5వ వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం నకిరేకల్ యాదవ సంఘం భవనంలో ఏషబోయిన వెంకటేశం యాదవ్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన నకిరేకల్, నాగార్జునసాగర్ నియోజకవర్గాల అభివృద్ధి కోసం చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం ప్రతినిధులు ఏర్పుల వెంకన్న, ఏర్పుల లింగయ్య, బొల్లం సత్తయ్య, కదిరే ఇస్తారీ కొత్తోల్ల నరసింహ, ఏర్పుల రేణుక, యాకయ్య పాల్గొన్నారు.