01-12-2025 07:18:24 PM
పాపన్నపేట (విజయక్రాంతి): పాపన్నపేట మండలంలో ఈనెల 11న జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్సై సారా శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఎన్నికలలో ఎవరైనా కోడ్ ను ఉల్లంఘించిన, అధికారుల విధులకు ఆటంకాలు కలిగించిన చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజలు అధికారులకు సహకరించి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యంగా యువత ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపారు. ప్రజలు ఇరు పార్టీల నాయకులు పోలీసులకు సహకరించాలని ఎస్ఐ కోరారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు అభ్యర్థులు డబ్బులు, మద్యం పంపిణీ చేస్తే నేరమన్నారు.